5 వ డివిజన్ లో ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్ అభ్యర్ధి తాడిశెట్టి విద్యాసాగర్
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 5వ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాడిశెట్టి విద్యాసాగర్ ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజలతో కలిసి ఆదివారం డివిజన్ లో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి వెళ్లి టిఆర్ఎస్ పార్టీ పేద ప్రజల కోసం చేస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ ఈ ప్రాంత అభివృద్ధి పట్ల చేస్తున్నా కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని ఓటర్ మా ఆయన విజ్ఞప్తి చేశారు. ఆయన ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఈ ప్రచార కార్యక్రమాన్ని ఉద్దేశించి 5వ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న తాడిశెట్టి విద్యాసాగర్ మాట్లాడుతూ, గతంలో కార్పొరేటర్ గా ఈ డివిజన్ అభివృద్ధికి నిరంతరం పని చేశానని, మరోసారి అవకాశం కల్పిస్తే ఈ డివిజన్ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపు తానని ఆయన తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ సహకారంతో డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి పరచాలని ఆయన తెలిపారు.
నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. అనేక మంది ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడం జరిగింది అని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ కు ఈ డివిజన్లో ఓటు అడిగే అర్హత లేదని ఆయన అన్నారు. టిఆర్ఎస్ పార్టీతోనే ఈ డివిజన్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, మరోసారి తనకు అవకాశం కల్పించి ఆశీర్వదించి ఓటేసి గెలిపిస్తే, ఈ డివిజన్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బొల్లంపల్లి పున్నం చందర్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇనుగాల మల్లేశం, అంజి, సతీష్ రెడ్డి, రఘు, పీవీ రమేష్, రామారావు, పా ష , ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.