మున్సిపల్ ఎన్నికలు జరగాల్సిన పట్టణాలు, నగరాల్లో అప్పుడే ఎన్నికల సందడి మొదలైయింది… ఆశావహులు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తే అప్పుడే రంగంలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు… ఈ ఎన్నికల వేడి గత ఆరు నెలల క్రితమే మొదలయిన ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలన గడువు తీరిపోవడంతో మరింత వేడి రాజుకుంది… గ్రేటర్ వరంగల్ లో డివిజన్ల పెంపు, కొత్త డివిజన్ ల ఏర్పాటు, రిజర్వేషన్ లపై ప్రస్తుతం హాట్ హాట్ గా చర్చ కొనసాగుతుంది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న డివిజన్లు సరిగా ఏర్పాటు చేయలేదని పలువురు మున్సిపల్ అధికారులకు తమ అభ్యంతరాలను తెలిపారు… వాటి పరిశీలన విషయం పక్కన పెడితే.. ఈనెల 17 న నోటిపికేషన్ 30 న ఎన్నికలు జరుగుతాయనే ఊహాగానాలు జోరుగా ప్రచారం జరుగుతుండగా పోటీలో నిలిచేందుకు పలువురు అబ్యర్థులు తమ తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. కొత్తగా పోటీ చేయాలనుకునే వారు తమకు సంబందించిన వారితో అప్పుడే క్షేత్ర స్థాయిలో పని మొదలుపెట్టగా… కొందరిలో మాత్రం గుబులు పుట్టుకొచ్చిందట.
తాజా మాజిల్లో గుబులు…
గ్రేటర్ వరంగల్ మొన్నటి వరకు టీఆర్ఎస్ పాలనలోనే ఉండగా ఇటీవలే గ్రేటర్ పాలన గడువు ముగియడంతో తాజాగా మాజీ లయిన కార్పొరేటర్ లల్లో అప్పుడే గుబులు మొదలయిందట… గులాబీ పార్టీ నుంచి సిట్టింగ్ కార్పొరేటర్ లమే అయిన అధిష్టానం టిక్కెట్ మళ్ళీ ఇచ్చి తమను బరిలో నిలుపుతుందో లేదోననే గుబులు వారిలో పట్టుకున్నట్లు తెలుస్తుంది… ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ లు వారి పనితీరు ప్రజల్లో వారికున్న గ్రాఫ్ తదితర అంశాలపై టీఆర్ఎస్ అధిష్టానం అప్పుడే ఓ నివేదిక తెప్పించుకున్నట్లు తెలుస్తుంది. అధిష్టానం వద్ద ఉన్న ఈ నివేదిక ఆధారంగా కొందరికి టిక్కెట్ దక్కకపోవచ్చనే టాక్ వినపడుతోంది… ఇటీవల జరిగిన జి ఏచ్ ఎం సి ఎన్నికల్లో అధికార పార్టీ ఎక్కువ మొత్తంలో సిట్టింగ్ లకే టికెట్ కేటాయించగా వారిపై స్థానికంగా ఉన్న వ్యతిరేకత తో గులాబీకి ఓట్లు పడక ఎక్కువ మొత్తంలో సీట్లు కోల్పోవడంతో ఈసారి గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో ఆ తప్పిదం చేసి సీట్లు కోల్పోకూడదనే అధిష్టానం బావిస్తున్నట్లు సమాచారం. దింతో గ్రేటర్ వరంగల్ పరిధిలో దాదాపు ఎక్కువమొత్తం లోనే సిట్టింగ్ లు టికెట్ నిరాకరించే అవకాశాలు మెండుగానే ఉన్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి. మరోవైపు డివిజన్ల సంఖ్య పెరుగుతుండడంతో సిట్టింగ్ లతో సహా ఆశవహుల్లో అంత అయోమయం నెలకొంది. కొంతమంది కార్పొరేటర్ గా పోటీచేసేందుకు ఐదు సంవత్సరాలు గా ఎదురు చూస్తూ వారి డివిజన్ లల్లో పనిచేస్తుండగా కొత్త డివిజన్ ల ఏర్పాటుతో వారిలో తలనొప్పి మొదలయింది…వారు పనిచేస్తున్న డివిజన్ లోని కొన్ని ప్రాంతాలు వేరే డివిజన్ లల్లో కలవడంతో ఎం చేయాలో తెలియని స్థితిలో వారు ఉన్నారట… దీనికి తోడు వివిధ డివిజన్ లల్లో కొత్త డివిజన్ల మూలంగా రిజర్వేషన్ సైతం మారుతున్నట్లు ప్రచారం జరుగుతుండగా ఆశవహుల్లో ఎక్కడలేని భయం పట్టుకుందట.
సమర్థుల వేటలో బీజేపీ, కాంగ్రెస్…
గ్రేటర్ వరంగల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళా ఆయా డివిజన్లలో సమర్థులైన అభ్యర్థుల కోసం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు వేట మొదలుపెట్టాయి. ఇప్పటికే ఈ రెండు పార్టీలకు సంబంధించి ఆయా డివిజన్ లల్లో ఆశావహులు ఉండగా గెలుపు గుర్రాలకోసం ఈ పార్టీలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. టిక్కెట్ లభించగా అసంతృప్తి తో ఉన్న సీనియర్ నాయకులు చివరి నిమిషంలో కండువా మార్చిన గెలుపే ద్యేయంగా వారిని ఆహ్వానించి ప్రత్యర్థి పార్టీకి షాక్ ఇచ్చేందుకు సైతం ఈ రెండు పార్టీలు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది… ఇప్పటికే ఈ పార్టీలు గ్రేటర్ ఎన్నికల విషయంలో డివిజన్ ల లోని తమ క్యాడర్ తో టచ్ లో ఉంటున్నారు…ఇది ఇలావుంటే ఈసారి ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలకు ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఇబ్బందులు ఎదురయేలా ఉన్నాయి… టికెట్ దక్కకా ఎంత బుజ్జగించిన వినని ఆశావహులు కొందరు రెబల్ అవతారం ఎత్తే అవకాశం లేకపోలేదు… దింతో ఏ పార్టీలో ఏ అభ్యర్తి విజయానికి ఈ రెబల్ అబ్యర్తులు గండి కొడతారోనని కొందరిలో అప్పుడే టెన్షన్ మొదలయిందట.
బలమైన స్వతంత్ర అభ్యర్ధులు…?
ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో వివిధ డివిజన్లలో బలమైన స్వతంత్ర అబ్యర్థులు సైతం ఎన్నికల బరిలో దిగి తమ సత్తా చాటనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పలు డివిజన్ లల్లో వివిధ సామాజిక సేవ కార్యక్రమాలలో దూసుకు పోతూ డివిజన్ లోని ప్రజలతో నిత్యం టచ్ లో ఉంటున్న వీరు విజయం సాధించిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని పలువురు అంటున్నారు.. కొన్ని డివిజన్ లల్లో పోటీచేయబోతున్న కొంతమంది ప్రదానపార్టీల అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్ధుల విషయంలో కంగారు పడుతున్నట్లు తెలిసింది… వీరిని అడ్డుకోవడం ఎలా సాధ్యం అవుతుందో తెలియక వారు ఇప్పుడే తమ గెలుపు విషయంలో పునరాలోచనలో పడినట్లు సమాచారం.
బరిలోకి జనసేన….!
ఇక ఈసారి ప్రధాన పార్టీ లతో పాటు గ్రేటర్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన రంగంలోకి దిగబోతుంది… ఇప్పటికే వరంగల్ నగరంలో కార్యాలయాన్ని ప్రారంభించి తమ పనిని ప్రారంభించిన పవన్ పార్టీ ఆయా డివిజన్ లల్లో తమ అబ్యర్ధులను బరిలో నిలిపి మొదటి సారిగా అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది… ఏదిఏమైనా ఈసారి గ్రేటర్ ఎన్నికలు చాలా రసవత్తరంగా మారనుండగా టిక్కెట్ వచ్చే వరకు తాజా మాజిలకు మాత్రం నిద్ర పట్టకుండా చేస్తున్నాయనేది నిజం.