ధాన్యం డబ్బులు రావు – మలుసుకొని పండాలే…!

ధాన్యం కొనుగోలు డబ్బులు కాంటా వేసినదానికంటే వేలల్లో తక్కువగా వచ్చాయని పిర్యాదు చేసిన రైతులకు దక్కిన గౌరవం ఇది… ఒక్కో రైతుకు పదివేల రూపాయలకు పైగా ధాన్యం డబ్బులు తక్కువగా రాగా చేసిన పిర్యాదు పరిష్కారం ఎందాకా వచ్చిందని ఐ కె పి కమ్యూనిటీ కోఆర్డినెటర్ కు ఫోన్ చేస్తే దక్కిన మర్యాద ఇది… డబ్బులు రావు మలుసుకొని పండుకో అంటూ బూతుపురాణం అందుకున్న శాయంపేట మండల ఐకేపి కమ్యూనిటీ కోఆర్డినెటర్ బరితెగింపు తనం ఇది… పొద్దటి పూటనే ఫుల్లుగా తాగి సమాధానం చెప్పిన నిర్లక్ష్యపు తనమిది వివరాల్లోకి వెళితే శాయంపేట మండలంలో కొంతమంది రైతులు ఇటీవల ఐకేపి కి ధాన్యాన్ని విక్రయించారు… ఈ దాన్యానికి రావాల్సిన డబ్బులు కాంటా వేసినదానికంటే తక్కువగా వచ్చాయి… చాలామంది రైతులకు వేలల్లో డబ్బులు ఖాతాల్లో తక్కువగా జమ ఐయ్యాయి… దింతో ఆందోళన చెందిన రైతులు కాంటా వేసిన దానికంటే తక్కువగా వచ్చాయి… మిగతా డబ్బులు వచ్చేలా చేయాలని ఐకేపి కమ్యూనిటీ కోఆర్డినెటర్ కేదారికి లిఖితపూర్వకంగా ఈనెల 3 న పిర్యాదు చేసారు… తమ డబ్బులు వచ్చేలా చూడాలని విన్నవించుకున్నారు.

ధాన్యం డబ్బులు రావు - మలుసుకొని పండాలే...!- news10.app

పిర్యాదు చేసి వారం గడుస్తున్నా ఎలాంటి సమాధానం లేకపోవడం సమస్య పరిష్కారం కాకపోవడంతో శనివారం ఉదయం ఓ రైతు ఫోన్ చేసి తమ పిర్యాదు పరిష్కారం ఎందాకా వచ్చింది సార్ ప్రశ్నించాడు అంతే కమ్యూనిటీ కోఆర్డినెటర్ కేదారి బూతు పురాణం అందుకున్నాడు. ధాన్యం డబ్బులు రావు అంతే మలుసుకొని పండాలి అంటూ అసభ్యకరంగా మాట్లాడాడు… కలెక్టర్ కు పిర్యాదు చేసిన ఆ డబ్బులు వచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెప్పాడు… తాను పది ఎకరాలు ఉన్న రైతునే అంటూ రైతుల పట్ల ఫోన్ లో దురుసుగా ప్రవర్తించాడు.దింతో ఎం చేయాలో తెలియని రైతులు ఫోన్ పెట్టేసారు… ఈ సంభాషణ ను అంత రికార్డ్ చేసిన రైతులు న్యూస్10 ప్రతినిధికి అందించి పాపం తమ గోడు వెళ్ల బోసుకున్నారు. ధాన్యం డబ్బులు తక్కువగా వచ్చాయనే విషయాన్ని శాయంపేట ఎంపీడీఓ దృష్టికీ సైతం తాము తీసుకువెళ్లామని… లిఖితపూర్వకంగా పిర్యాదు సైతం చేశామని తెలిపారు… పిర్యాదు చేసిన పట్టించుకోకుండా ఫోన్ చేస్తే అమర్యాదగా మాట్లాడిన ఐకేపి సిసి కేదారి పై చర్యలు తీసుకోవాలని ,అతన్ని వెంటనే విధుల్లోంచి తొలగించాలని రైతులు డిమాండ్ చేశారు..తమ కు ఇంకా రావాల్సిన ధాన్యం డబ్బులను వెంటనే చెల్లించాలని కోరారు. మరి ఈ విషయంలో అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.