లాక్డౌన్ నేపథ్యంలో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులతో పాటు ఆటోలు, క్యాబ్ సర్వీసులు ఆగిపోయాయి. వ్యక్తిగత, నిత్యావసర సరుకులను చేరవేసే వాహనాలు తప్ప ఏవీ తిరగడం లేదు. ఈ నేపథ్యంలో అత్యవసరంగా ఆస్పత్రులకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అలాంటి వారికి సాయం చేసేందుకు మహేంద్ర ఎలైట్ ఆఫ్ లాజిస్టిక్స్ సంస్థ ముందుకొచ్చింది. నగరంలో అత్యవసర సేవల కోసం ఉచితంగా క్యాబ్ సర్వీసులను అందిస్తోంది. ఇప్పటికే రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న ఈ సేవలను నేటి నుంచి హైదరాబాద్ కమిషనరేట్‌కు విస్తరించారు.
బషీర్‌బాగ్‌లోని పోలీస్ కమిషనరేట్ వద్ద సీపీ అంజనీకుమార్ జెండా ఊపి క్యాబ్ సేవలను ప్రారంభించారు.
వృద్ధులు, గర్భవతులు, చిన్నారుల్లో అనారోగ్య సమస్యలు తలెత్తినపుడు ఎలైట్ క్యాబ్‌లు ఆస్పత్రులకు చేరుస్తాయి. నగరంలో అత్యవసర సేవల కోసం 24 గంటల పాటు ఏడు క్యాబ్‌ల ద్వారా ఉచితంగా సేవలందిస్తామని మహేంద్ర ఎలైట్ ఆఫ్ లాజిస్టిక్స్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. క్యాబ్ బుకింగ్ కోసం 8433958158 నంబర్‌కు కాల్ చేయాలని నగరవాసులకు సూచించారు.