అసలే ఇది కరోనా కాలం ప్రపంచమే లాక్ డౌన్ తో ఇంట్లో కూర్చుంటుంది.పెరిగిన పాసిటివ్ కేసులు, వచ్చిన నెగిటివ్ రిపోర్టులు లెక్కలు చూస్తూ ప్రజల ప్రాణాలను కాపాడడంలో ప్రభుత్యం,అధికార యంత్రాంగం తలమునకలై ఉంది. లాక్ డౌన్ మూలంగా ప్రజలందరూ ఇంటికే పరిమితం అయిపోయారు.
దాదాపు అన్ని రంగాల్లో పనులు పూర్తిగా నిలిచి పోయాయి.అయితే ఇందులో అన్ని రంగాలు తమ తమ పనులను నిలిపివేసి ఇంటికే పరిమితం అయిన చేతికొచ్చిన పంటను ఎలా చేను దాటించాలని ప్రస్తుతం రైతులు ఆలోచనలో పడ్డారు. వరి, మొక్కజొన్న, పత్తి,మిరప రైతులకు ప్రభుత్వం సహకారం అందిస్తుండగా వీరు ఎలాగోలా కొంత ఆలస్యం అయినా గండం నుంచి గట్టెక్కుతారు కానీ తెలంగాణలో పూలు సాగు చేస్తున్న రైతుల పరిస్థితే దారుణంగా మారింది.లాక్ డౌన్ కారణంగా మార్కెట్ లేకపోవడం తో పూసిన పూలు నేల రాలి పోతుండటంతో రోజు రోజుకు కలుగుతున్న నష్టాన్ని చూసి లబోదిబో మంటున్నారు.ఎకరాల కొద్ది వివిధ రకాల పూల తోటలు సాగు చేసిన రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. వేరే ప్రత్యామ్నాయం లేక దిగాలు పడి పోతున్నారు.
బంతి సిరులు నేల పాలు
ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో బంతి పూలు సాగు చేస్తున్న రైతుల పరిస్థితి దారుణంగా ఉంది.తోటలో బంతి పూలు విరగ పూసి నేల రాలి పోతున్నాయి.జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో బంతి సాగు చేస్తున్న రైతు పరిస్థితి బాధాకరంగాఉంది. మహాదేవపూర్ మండల కేంద్రంలో వ్యవసాయంలో నూతన ఒరవడి సృష్టించి. పూల సాగు తో ఆదర్శ రైతుగా రాణించిన ఉస్మాన్ ఖాన్..ను దేవుడు కరుణించిన.. కరోనా కనికరం చూపలేదు.. లాక్ డౌన్ ఆ బంతి రైతుపాలిటశాపమైంది..సిరులు కురిపించే బంతి పూలు,కనుల ముందేనేలపాలుఅవుతుంటే..ఆ రైతు వ్యధ మాటలతో చెప్పలేనిది. మురిపించిన బంతి పూలు, పీకల్లోతుముంచేశాయి.. ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా అరుకాలం శ్రమించి,స్వేదం చిందించి.. పంట పండించిన లాక్ డౌన్ వల్ల మార్కెట్ లేక దిక్కుతోచక.. దిగులు.. బుగులుతో కాలం వెల్లదీస్తున్నాడు.. బంతి పూలను నిల్వ చేసే వీలు లేదు.. అమ్ముకోవడానికి మార్కెట్ లేదు.. పెండ్లిలు లేవు.. శుభకార్యాలు అంతకన్నా లేవు.. .. మరో సీజన్ కోసంఎదురుచూడ టం తప్ప చేసేదేమీ లేదు దీంతో నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలనే ఆవేదన లో రైతు పడిపోయాడు.. 18 ఎకరాలలో సాగు చేసిన బంతి పూల తోట ఈ సారి తనకు నయా పైసా కూడా సంపాదించి పెట్టక పోవడంతో రైతు ఆవేదన వ్యక్తంచేశా డు. తనకు సుమారుగా 18లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని కన్నీరు పెట్టుకున్నాడు.