ఆయన ఎక్సైజ్ శాఖలో ఓ సిఐ… గత ఐదు ఏళ్లుగా ఒకే చోట కడుపులో చల్ల కదలకుండా చాలా సుఖంగా కొలువు చేస్తున్నాడు… కొలువంటే అలాంటి ఇలాంటి కొలువుకాదు సర్కార్ వారు ఇచ్చే దానికన్నా అంతకుమించి మామూళ్లు దండుకునే కొలువది… షాపు కు ఇంత బారుకింత అని నెలవారి మామూళ్లు ఫిక్స్ చేసి కూర్చునే ఈ సిఐ సారు నెల నెలా క్రమంతప్పకుండా రావాలని బార్, వైన్స్ యజమానులకు ఎప్పుడో హుకుం జారీ చేసాడట… ఆయనగారి కి రావాల్సిన మొత్తం నెలలో మిస్ ఐయ్యిందంటే చాలు ఆ సవాలక్ష ప్రశ్నలు వేసి వారికి చుక్కలు చూపెడుతాడట.సర్కారే దండిగా మద్యం అమ్మమంటుంది… సందట్లో సడే మియా లాగా తాను కూడా కావాల్సింది దండుకుంటే ఏమవుతుంది అనుకున్నాడో ఏమో కాని ఈ ఎక్సైజ్ సిఐ మద్యం వ్యాపారులను రాచిరంపాన పెడుతూ నెలకు లక్షల్లో సంపాదిస్తూ ఓ మాటలో చెప్పాలంటే ఈ సిఐ సారు అప్పనంగా వచ్చే సొమ్ముకు అలవాటు పడి రోజు రోజుకు మద్యం వ్యాపారులను తెగ ఇబ్బందులు పెడుతున్నాడట.
నెల ఆదాయం భారీగా…?
హన్మకొండ ఎక్సైజ్ పరిధిలో బార్లు, వైన్స్ బాగానే ఉన్నాయి. ఈ సిఐ సారు పరిధిలో 40 బార్లు, 26 వైన్స్ ఉండగా… నెలవారిగా ఒక్కో వైన్స్ నుంచి 26 వేలు, బార్ ఐయితే నెలకు 12 వేలు వసూలు చేస్తున్నట్లు తెలిసింది.అంటే ఈ సిఐ సారు ఆదాయం నెలకు 8 లక్షల పైనే అన్నమాట.అంతేకాదు అంతే కాదు కొత్తగా వైన్స్ పెట్టిన, రెన్యూవల్ ఐయిన సింగిల్ సెటిల్మెంట్ కింద ఒకేసారి ఈ సిఐ సారుకు లక్ష యాబై వేలు చెల్లించాలట.. నెల మామూలుకు దింతో సంబంధం లేదు అది నెలనెలా కామనేనట. ఇక కొన్ని మాస్ ఏరియాల్లో ఉన్న వైన్స్ షాపులకు ఏమైనా బెల్ట్ షాపులకు మద్యం సరఫరా ఉంటే ఈ సిఐ గారు వారి వద్దనుంచి పది వేల రూపాయలు అదనంగా వసూలు చేస్తాడట. ఇలా ఈ సిఐ సారు గారి ఆదాయం నెలకు లక్షలు దాటుతుందట ఐయిన ఏమాత్రం తృప్తి లేని ఈ సారు గారు ఇంకా బార్లు, వైన్స్ యాజమాన్యాలు వేదిస్తూనే ఉన్నాడని ఆరోపణలు వస్తున్నాయి.
వసూళ్లకు ప్రైవేట్ వ్యక్తి ..?
అక్రమ ఆదాయం నెల వారీగా దండిగా ఉన్న ఈ ఎక్సైజ్ సిఐ సారు నేరుగా తాను రంగంలోకి దిగి నెల వారి మామూళ్లు వసూలు చేస్తే బాగోదు కనుక ఈ వసూళ్లకు ఏకంగా ఓ ప్రయివేటు వ్యక్తి ని తన వద్ద ఉద్యోగిగా నియమించుకున్నాడట. ఈ ప్రయివేట్ వ్యక్తి నెల నెలా బార్లు, వైన్స్ అన్ని కలియతిరిగి సారు చేతిలో లక్షల రూపాయలు వేసి వేలల్లో జీతం తీసుకుంటాడట. సిఐ సారు వసూళ్లకే ఓ ప్రయివేటు వ్యక్తిని ఉద్యోగిగా నియమించుకున్నాడంటే అతగాడి ఆదాయం ఏ రేంజ్ లో ఉందొ ఇట్టే అర్థం అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ సిఐ సారు మామూళ్ల వేదింపులతో విసిగిపోయిన బార్, వైన్స్ యజమానులు ఎక్సైజ్ శాఖలోని పై అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. రేపో మాపో వీరు ఎక్సైజ్ ఉన్నతాధికారులను కలిసి ఎక్సైజ్ సిఐ పై చర్యలు తీసుకోవాలని కోరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.మరి మామ్ముళ్లకోసం ఇంతలా పీడిస్తూ నెలకు లక్షల్లో అక్రమంగా దండుకుంటున్న ఈ ఎక్సైజ్ సిఐ పై ఉన్నతాధికారులు ఎం చర్యలు తీసుకుంటారో చూడాలి.
(ఆ సిఐ బాగానే కూడబెట్టాడు….?
మరో సంచికలో)