దుబ్బాకలో జంపింగ్ జపాంగ్ లు

టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చెరుకు ముత్యం రెడ్డి తనయుడు శ్రీనివాసరెడ్డి
కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి టి పి సి సి ప్రచార కమిటీ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట నర్సింహ రెడ్డి
ఎన్నికల వేళ జంపింగ్ లకు భారీ గిరాకి
గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డుతున్న ప్రధాన పార్టీలు
దుబ్బాకలో మోహరించిన కాంగ్రెస్ శ్రేణులు గ్రామాల వారిగా ఇంచార్జ్ లు
అన్నితానై నడిపిస్తున్న ట్ర బుల్ షూటర్ మంత్రి హరీష్ రావు

దుబ్బాకలో జంపింగ్ జపాంగ్ లు- news10.app

ఎన్నికల వేళ జంపింగ్ జపాంగ్ లు బయట పడడం సర్వసాధారణమే … కప్పుల తక్కెడ మనస్తత్వం ఉన్న నాయకులు ఎక్కడ ఎం జరుగుతుందోనని, ఇక్కడైన రాజకీయ భవిష్యత్ బాగుంటుందేమోనని జంపింగ్ కు ప్రాధాన్యతను ఇస్తుంటారు… పార్టీ మారే ముందు తమ గొంతెమ్మ కోర్కెల లిస్ట్ కొత్తగా చేరబోయే పార్టీ నాయకుల ముందు పెట్టి లిస్ట్ లో కనీసం యాభై శాతం కోర్కెలు తీరిన జంప్ చేస్తుంటారు…. ఆ తర్వాత కోర్కెలు తిరాయ… మారిన పార్టీలో న్యాయం జరిగిందా అనేది తర్వాతి విషయం తక్షణం గా తమకు కొన్ని కోరికలు తిరితే చాలు,ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగితే చాలు అనుకునేవారు సైతం ఉన్నారు. సాధారణ ఎన్నికల సమయంలో జంపింగ్ జపాంగ్ లు ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు. వీరికి ప్రాదాన్యత సైతం అలాగే ఉంటుంది ఈ విషయం పక్కన పెడితే ఉప ఎన్నికల పోరుతో హాట్ హాట్ గా ఉన్న దుబ్బాకలో జంపింగ్ జపాంగ్ లు చిన్న చితక నుంచి మొదలుకొని పెద్ద స్థాయి క్యాడర్ వరకు కనబడుతున్నారు…. తాము ప్రస్తుతం ఉన్న పార్టీలో తమకు న్యాయం జరగడం లేదని కొందరు గోడ దూకితే…. ఎమ్మెల్యే టిక్కెట్ దక్కలేదని కొందరు జంపింగ్ జపాంగ్ అవతారం ఎత్తారు… మాజీ ఎమ్మెల్యే, మంత్రి ముత్యం రెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి గులాబీ పార్టీలో టిక్కెట్ కోసం ప్రయత్నించి సాధ్యం కాకపోవడంతో హస్తం అందుకొని టిక్కెట్ పొందాడు…. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచాడు. చెరుకు శ్రీనివాస్ రెడ్డి రాకతో కాంగ్రెసులో కొంతమంది అసంతృప్తులు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారు… తాజాగా టి పి సి సి ప్రచార కమిటీ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట నరసింహ రెడ్డి గులాబీ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. మంత్రి హరీష్ రావు సమక్షంలో గులాబీ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమవుతోందని తెలిసింది. వీరే గాక ఇంకా చాలామంది ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు తమ డిమాండ్ లు చెపుతూ పార్టీలు మారేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. అటు బిజెపిలోను అసంతృప్తుల సంఖ్య రోజురోజుకు పెరిగి పోతుంది… రఘునందరావు కు అవకాశం ఇవ్వడం నచ్చని నేతలు కొందరు పార్టీ మారే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రఘునందన్ రావు కు టిక్కెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకించిన బిజెపి సీనియర్ నాయకున్నీ ఆ పార్టీ సస్పెండ్ చేసింది.దింతో కమలం వీడేందుకు చాలామందే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలన్నీ దుబ్బాక ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇక్కడ ప్రస్తుతం జంపింగ్, జపాంగ్ లకు గిరాకీ బాగానే ఉన్నట్లు వివిధ పార్టీల కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.

గెలుపుకోసం…..

ప్రస్తుత దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి మూడు ప్రధాన పార్టీలు తమ సర్వ శక్తులు ఒడ్డుతున్నారు… తమదైన శైలిలో వ్యూహాలు రచిస్తూ గెలవడం కోసం శ్రమిస్తున్నాయి.కాంగ్రెస్ పార్టీ దుబ్బాక స్థానాన్ని దక్కించుకోవడం కోసం తమ శ్రేణులన్నింటిని దుబ్బాకలో మోహరించింది… తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పార్టీ అధ్యక్షులు ముఖ్య కార్యకర్తలను నియోజకవర్గం లోని గ్రామాల్లో ఇంచార్జ్ లుగా నియమించి ఎప్పటికప్పుడు ప్రచారం నిర్వహిస్తూ గెలుపుకోసం కష్టపడుతున్నారు.అసంతృప్తులెవరు పార్టీ మారకుండా వారిని బుజ్జగిస్తూ ముందుకు సాగుతున్నారు.

అన్నీతానే….

దుబ్బాక ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాదించేందుకు ట్రబుల్ షూటర్ మంత్రి హరీశ్ రావు అన్ని తానై నడిపిస్తున్నాడు… పార్టీలో ఎవరు అసంతృప్తి చెందకుండా ఎన్నికల వేళ గులాబీలు వేరే పార్టీ వైపు చూడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసంతృప్తులు ఎవరైనా ఉంటే వారిని బుజ్జగిస్తూ దారికి తెచ్చి పార్టీ కోసం పని చేసేలా చేస్తున్నారు.విజయం మాదే…మెజార్టీ కోసమే ప్రయత్నం అంటున్న హరీష్ దుబ్బాకలో తనదైన శైలిలో భారీగానే శ్రమిస్తున్నారు.