సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారంలో పది ఎకరాల్లో అక్రమంగా వెంచర్ నిర్వహిస్తున్న ఎలాంటి చర్యలు తీసుకోకుండా మొద్దునిద్ర నటిస్తున్నారు. నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా ఉందని తెలిసిన చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. వెంచర్ నిర్వహణ కోసం ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ప్రభుత్వ ఆదాయానికి వెంచర్ నిర్వాహకులు గండి కొడుతున్న అధికారులు మాత్రం తమకేంపట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
రియల్టర్ల తో కుమ్మక్కు…?
హస్నాబాద్ మండలం పోతారం గ్రామంలో పది ఎకరాల్లో ఎలాంటి అనుమతులు లేకుండావెంచర్ ఏర్పాటు చేసిన చర్యలు తీసుకోవాల్సిన డి టి సి పి అధికారులు ఎందుకు వెనుకాడుతున్నారో అర్థం కానీ విషయం. పోతారం అక్రమ వెంచర్ పై చర్యలకు వెనుకాడుతున్న డి టి పి సి రియల్టర్ల తో కుమ్మకైనట్లు ఆరోపణలు వస్తున్నాయి.వెంచర్ పై ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తున్న అధికారులు ముడుపులకు అలవాటు పడ్డారని పెద్దఎత్తున్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఇకనైనా ఈ అక్రమ వెంచర్ ను నిలిపివేసి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.అధికారులు ఇకనైనా నిర్లక్ష్యం వీడి చర్యలు తీసుకుంటారా లేదా చూడాలి.