ఆ సూపరిండెంట్ సారు ఏమాత్రం మారేలా లేడు… ఎవరెన్ని ఫిర్యాదులు చేసిన ఆ డాక్టర్ సార్ విధులకు హాజరుకావడం లేదని ఉన్నతాధికారులకు చెప్పిన ఆ సార్ మారేలా లేడు… విధులకు అసలు హాజరు ఐయ్యేలా లేడు.. దింతో ఆ సూపరింటెండెంట్ విధులకు హాజరు ఐయ్యేలా చూడాలని కొందరు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నే కోరుతున్నారు.ఉన్నతాధికారులు ఎలాగు ఆయనపై చర్యలు తీసుకోరు కనీసం అమాత్యులైన ఆ సూపరిండెంట్ పై చర్యలు తీసుకుంటారేమోనని ఎదురు చూస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే హన్మకొండ జిల్లాలోని ప్రభుత్వ ఛాతి క్షయ వైద్యాసుపత్రిలో సూపరిండెంట్ ఇష్టారాజ్యం ఇంకా అలాగే కొనసాగుతోందట… అంతా నా ఇష్టం నేనెప్పుడైనా వస్తా ఏదన్నా చేస్తా నన్ను అడిగేవారు లేరు ఈ ఆసుపత్రిని పట్టించుకునేవారే లేరన్నట్లు ఈ సారు వ్యవహరిస్తున్నాడట. జిల్లాలోనే ఛాతి క్షయ వ్యాధికి ఏకైక దిక్కుగా ఉన్నటువంటి ఈ ఆసుపత్రికి సూపరిండెంట్ గా ఉన్న ఈ సారు ఆసుపత్రిని పట్టించుకున్న పాపాన పోలేదట…. లక్షల్లో జీతాలు తీసుకుంటూ నెలలో కనీసం 5 రోజులు కూడా విధులకు హాజరుకావట్లేదని న్యూస్-10నిఘా టీం పరిశీలనలో వెల్లడయింది… ఈ సూపరిండెంట్ విధులకు హాజరయ్యే విషయం పై గతంలో న్యూస్-10 కథనాలను ప్రచురించగానే సక్రమంగా విధులకు హాజరైన ఈ సారు తన గత బుద్దిని చూపిస్తూ విధులకు హాజరుకాకుండ పీజీ విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.. ఈ సారు వ్యవహారం పై హాజరువిధానం పై వైద్యారోగ్యశాఖ మంత్రి దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.