సిట్టింగులు, ఆశావాహుల గుండెల్లో గుబులు
ఓటర్ల తో మమేకమై డివిజన్ లో ప్రచారాలు
పొదుపు, కుల సంఘాలను ప్రసన్నం చేసుకుంటున్న వైనం
టికెట్ నాదంటే నాదని పోటాపోటీ ప్రచారం
ప్రజా ప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు
ఆశించి బంగ పడ్డ వారి ప్రయాణం ఎటువైపు
సిట్టింగులకు అని కొందరు ఉద్యమం లో పాల్గొన్న వారికి ఎమ్మెల్యేల తో మంత్రులతో కలివిడిగా ఉన్నవారికి అని మరి కొందరు ఇలా రాబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఆశించే వారు పదుల్లో కాదు వందల్లో ఉన్నట్టు అంచనా ఎమ్మెల్యే మాట ఇచ్చాడు మంత్రి మాకే కమిట్ అయ్యాడు అధిష్టానం నన్ను గుర్తించింది అని మరికొందరు ఇలా గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో టికెట్ మాదంటే మాదని ప్రచారం కూడా కొనసాగిస్తున్నట్టు తెలిసింది.
ఇదిలా ఉండగా ఎవరి ధీమా వారిది అన్నట్టు నాయకులు మాకు హామీ ఇచ్చారు అంటే మాకని ప్రచారం చేస్తూ డివిజన్ ప్రజల్లో ప్రచారానికి సన్నహకాలు చేస్తున్నట్టు సమాచారం మహిళా సంఘాలు పరపతి పొదుపు, కుల సంఘాలతో మమేకమై ఈ అవకాశం మనం ఉపయోగించుకోవాలి అని అలా అయితే ప్రభుత్వం ప్రవేశ పెట్టె పథకాలు మనకు అందేలా ప్రయత్నం చేస్తామని నమ్మబలుకుతూ సంఘాలను ప్రసన్నం చేసుకుంటున్నట్టు తెలిసింది డివిజన్ లో ఓటర్ల జనాభాను బట్టి ఆశావాహులు వారికి వారే నిర్ణయం తీసుకుని ప్రచారం చేస్తున్నట్టు తెలియవచ్చింది.
గ్రేటర్ వరంగల్ లో జరిగే కార్పొరేటర్ ఎన్నికల్లో మనదే పై చేయి కావాలని ముందస్తుగా కులాల వారిగా రాజకీయం చేస్తూ మన అభ్యర్థి నే గెలిపించాలని ప్రచారం చేస్తూ డివిజన్ ప్రజల వద్ద మాట తీసుకుంటున్నట్టు తెలియవచ్చింది వర్గాల వారిగా కులాల వారిగా మా కులం వాడు మాకే టికెట్ ఇస్తాడు అని కొందరు కుల ప్రస్తావన తీసుకొచ్చి డివిజన్ లో కుల రాజకీయాలు చేస్తున్నట్టు విశ్వనీయ సమాచారం ఇప్పటికి డివిజన్ ల వారిగా రిజర్వేషన్ లు కేటాయించినప్పటికి బీఫార్మ్ మాదంటే మాదని డివిజన్ ల వారిగా ప్రచారం ముమ్మరం చేస్తున్నారు ఒకవేళ టికెట్ కేటాయించకున్న స్వతంత్ర అభ్యర్థి కొనసాగుతామని బాహాటంగా నే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది టికెట్ ఆశించి బంగ పడ్డ అభ్యర్థులు టీఆరెస్ రెబల్ గా కూడా ప్రయత్నాలు సాగిస్తారనే ప్రచారం సాగుతోంది ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉండటం వలన అభ్యర్థులు తర్జన భర్జనలో ఉన్నట్టు తెలిసింది రాబోయే వరంగల్ గ్రేటర్ ఎన్నికల్లో ఎలా పావులు కదపాలో నేటి నుండి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు ఇదిలా ఉండగా రేపటి నుండి ప్రజా ప్రతినిధుల చుట్టూ ప్రదీక్షణలు చేయటానికి సన్నద్ధం అవుతున్నారు ఆశావాహులు. వేచి చూడాలి ఆశించిన వారికి టికెట్ ఇస్తారా లేదా అనేది బంగపడ్డ వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో అని ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.