బ్రాహ్మణ కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ

గజ్వేల్ ఐఓసీ భవన్ లో పేద బ్రాహ్మణ కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు, కిట్స్ ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పంపిణీ చేశారు. కరోనా వైరస్ కట్టడి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విశేషమైన కృషి చేస్తున్నదన్నారు. నిన్న కేవలం 2 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయని. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరంతరం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారని అన్నారు.
ఇందుకు ప్రజల సహకారం, వైద్యులు, పోలీసులు సేవలు అమోఘమని కొనియాడారు.బ్రాహ్మణ కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ- news10.appకరోనా వైరస్ గురించి బ్రాహ్మణులకు అవగాహన కల్పిస్తూ, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరు మీటరు దూరం డిస్టన్స్ ఉండాలని, మాస్కులు ధరించాలి. ఇంకా కొన్ని రోజులు లాక్ డౌన్ కు సహకరిస్తూ.., ఇలాగే అందరం ఐక్యతతో కరోనా వైరస్ తరిమికొడదామన్నారు. ప్రతి ఒక్క రేషన్ కార్డు వినియోగదారునికి ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం 1500 రూపాయలు బ్యాంకులో జమ చేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి, గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here