తెలంగాణ రాష్ట్రంలో కరోన తగ్గుముఖం పట్టింది. డబల్ డిజిట్ నుంచి సింగల్ డిజిట్ కు పడిపోయింది. పదిరోజుల క్రితం అంతకంతకు పెరిగిన పాజిటివ్ కేసుల సంఖ్య కొంత ఆందోళన కలిగించగా లాక్ డౌన్ పకడ్బందీ గా అమలు చేయడంతో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. సోమవారం తెలంగాణ వ్యాప్తంగా 2 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు ఐయాయి.
తెలంగాణ జిల్లాల్లో పాజిటివ్ కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదు. ఈరోజు నమోదైన 2 పాజిటివ్ కేసులు జీ హెచ్ ఎంసీ పరిధిలో నమోదు ఐనవేనని తెలంగాణ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొంది. ఇవాళ 16 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకు మొత్తం 332 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు తెలిపారు.
ఇప్పటి వరకు తెలంగాణా లో 1003 కేసులు నమోదు కాగా తెలంగాణా లో అక్టీవ్ కేసులు..646 ఉన్నాయని,ఇప్పటి వరకు 25 మంది మృతి చెందినట్లు బులెటిన్ లో వివరించారు.మొత్తానికి కరోన పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ఆరోగ్య శాఖకు కాస్త ఊపిరి పీల్చుకున్నట్లు ఐయింది.