డిజిటల్ భిక్షాటన కాదు… అసలు విషయం వేరు

ఫోన్ లేదు.. పే లేదు.! యాచకులుపై తప్పుగా ప్రచారం

డిజిటల్ భిక్షాటన కాదు... అసలు విషయం వేరు- news10.app

ఫోన్ పేలోని క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బుల ఇవ్వండి.. అంటూ గత రెండు రోజులగా ఓ ఫోటో వైరల్ అవుతుంది. ఈ విషయం పై కొన్ని పత్రికలు కథనాలు సైతం ప్రచురించాయి. అయితే అసలు విషయం ఆ పత్రికలు పసిగట్టలేక పోయాయి.ఆ ఫోటోలో ఉన్న ముగ్గురు వ్యక్తులు తమ కులవృత్తితో వేషధారణ చేసి కథలు చెబుతు యాచిస్తున్నారు. ఈ క్రమంలోనే గత రెండు రోజులుగా డోర్నకల్ మండలంలో తిరుగుతున్నారు. కాగా 25వ తేది ఉదయం పెరుమాండ్ల గ్రామానికి వచ్చి ఓ హోటల్ దగ్గర యాచిస్తుండగా హోటల్, ప్రక్కనే సెలూన్ యజమాని ఉదయమే డబ్బులు లేవన్నాడు. అక్కడే ఉన్న ఇద్దరు యువకులు సరదాగా సెలూన్ లో ఉన్న ఫోన్ పే క్యూ ఆర్ కోడ్ స్కానర్ ను చేతికి ఇచ్చి ఫోటో తీసీ వారి వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకున్నారు. ఈ ఫోటో అక్కడి నుండి గ్రూప్ లల్లో వైరల్ గా మారింది. అక్కడి నుంచి తప్పుగా ప్రచారం జరిగింది… డిజిటల్ భిక్షాటన అంటూ మొత్తంగా వైరల్ ఐయింది.