మిల్లు కూల దోసి… వెంచర్ వేసి

హసన్ పర్తి మండలం బావుపేట క్రాస్ వద్ద వెంచర్ దర్జా
అనుమతులు తీసుకోకుండానే వెంచర్ సిద్ధం
నాల కన్వర్షన్ లేదు… కుడా లే ఔట్ కాదు
3 ఎకరాల17 గుంటల్లో వెంచర్
ప్రధాన రహదారి వద్ద ఇంత పెద్ద వెంచర్ వేసిన ,అనుమతులు లేకున్నా పట్టించుకోని అధికారులు

వరంగల్ నగరశివారు అక్రమ వెంచర్లకు నిలయంగా మారుతుంది. గ్రేటర్ వరంగల్ నగరం రోజు రోజుకు అభివృద్ధిలో విస్తరిస్తుంటే దీనికితోడు వెంచర్లు సైతం పెరిగి పోతున్నాయి. నగరంలో ఉన్న భూములు అధిక ధరలు పలుకుతుండడంతో వీటికన్న నగర శివార్లలో ధరలు కాస్త బెటర్ గా ఉంటాయని జనం చూస్తుండడంతో ఇదే అదనుగా కొంతమంది అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్లు వేసి జనాన్ని పరేషాన్ చేస్తున్నారు.

మిల్లు కూల దోసి... వెంచర్ వేసి- news10.app

మిల్లు భవనం కూలదోసి

వరంగల్ అర్బన్ జిల్లా హసన్ పర్తి మండలం బావుపేట క్రాస్ వద్ద గతంలో అక్కడ ఉన్న మిల్లు భవనాన్ని కూలదోసి ఓ రియల్టర్ 3 ఎకరాల 17 గుంటల్లో వెంచర్ వేసాడు. గతంలో మిల్లుకు ఉన్న నాల కన్వర్షన్నే ఉపయోగించి వెంచర్ ను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇదంతా బాగానే ఉందనుకున్న ఇంత పెద్ద మొత్తంలో వెంచర్ ను సిద్ధం చేసిన యజమాని ‘కుడా ‘అనుమతులు మాత్రం తీసుకోవడం మరిచి పోయినట్లు ఉన్నాడు. ‘కుడా’ చెపుతున్న నిబంధనల ప్రకారం వెంచర్ ను సిద్ధం చేసి అంతర్గత రహదారులు, పార్కు,డ్రైనేజి తదితరాలు అన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ ఇవన్నీ ఎందుకు అనుకున్నారో ఏమో గాని 3 ఎకరాల 17 గుంటల్లో స్థలాన్ని చదును చేసి వెంచర్ ను సిద్ధం చేశారంతే… ఇక కొనుగోలు చేసే వారి ఇష్టం అన్నట్లుగా ప్లాట్లు అమ్మడానికి వీరు సిద్ధం అయ్యారట.

మిల్లు కూల దోసి... వెంచర్ వేసి- news10.app

అధికారులు ఎం చేస్తున్నట్లు…?

కరీంనగర్ ప్రధాన రహదారికి కూతవేటు దూరంలో ఏకరాలకొద్ది వెంచర్ వేసి అనుమతులు లేకుండా వ్యాపారం చేస్తున్న అధికారులకు మాత్రం ఇది కనపడడం లేదా… అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతులు లేని వెంచర్ లో ప్రజలు ప్లాట్ల ను కొనుగోలు చేసి నష్ట పోయాక అధికారులు స్పందిస్తారా… అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అనుమతులు లేకుండా వేసిన వెంచర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.