కరోనా వ్యాధిపై సోషల్ మీడియాలో తప్పుడు కథనాలను పోస్టులకు పాల్పడిన వారిపై వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఐదు కేసులను నమోదు చేశారని ఇందులో ముఖ్యంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులకు కరోనా వ్యాధి సోకినట్లుగా స్థానిక గ్రూప్ ల్లో పోస్ట్ చేయడం, వ్యక్తుల ఫోటోలను వినియోగించుకొని కరోనా వ్యాధికి గురైన వ్యక్తి అతని గ్రామం పేరును ప్రస్తావిస్తూ వాట్సప్ పోస్టులు చేయడంతో పాటు, టీవి ఛానెల్స్ లో తప్పుగా ప్రసారం చేయడం. ముఖ్యంగా ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను ప్రజలు భయభ్రాంతులకు గురైయ్యే విధంగా వెబ్ ఛానెల్స్ తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేయడం, అధే విధంగా ఎలాంటి సంఘటన జరగకున్న తప్పుడు వీడియో దృశ్యాలను సోషల్ మీడియాల్లో పోస్ట్ చేసినవారిపై కేసులు నమోదు చేయబడ్డాయని. అదే విధంగా కరోనా వ్యాధిపై సోషల్ మీడియాలో తప్పుడు కథనాలను పోస్టు చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించడంతో పాటు వారిపై వివిధ చట్టాల క్రింద కేసులను నమోదు చేయబడుతుందని వరంగల్ పోలీస్ కమీషనర్ డా.వి.రవీందర్ వెల్లడించారు.
కరోనా వ్యాధి నియంత్రణ కోసం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన నాటి నుండి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లాక్ డౌన్ ఉత్తర్వులను అతిక్రమించి అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు సంబంధించిన 1674 వాహనాలను పోలీసులు సీజ్ చేయడం జరిగింది. ఇందులో ద్వీచక్ర వాహనాలు1371, ఆటోరిక్షాలు242, కార్లు38, ట్రాక్టర్లు/బస్సులు 23 వాహనాలనుపోలీసులు సీజ్ చేయడంతో పాటు లాక్ డౌన్ ను ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు పోలీసులు 258 కేసులను నమోదు చేశారని వరంగల్ పోలీస్ కమిషనర్ డా. వి. రవీందర్ వెల్లడించడంతో పాటు లాక్ డౌన్ ను అతిక్రమించి అనవసరంగా రోడ్లపైకి వారిపై డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ 2005 మరియు భారతీయ శిక్షా స్మృతి అను సరించి కేసులను నమోదు చేయడంతో పాటు వాహనాలను సీజ్ చేయబడుతుంది పోలీస్ కమీషనర్ తెలిపారు.
యం.జి.యం సెంటర్ లో పోలీస్ కమీషనర్ హల్ చల్
వరంగల్ పోలీస్ కమిషనర్ బుధవారం వరంగల్ యం.జి.యం సెంటర్ లోని చెకింగ్ పాయింట్ ను ఆకస్మికంగా పరిశీలించారు. లాక్ డౌన్ నేపధ్యంలో అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనాలను కట్టడి చేయడం కోసం వరంగల్ పోలీస్ కమీషనర్ నగరంలో ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్బంగా యం.జి.యం సెంటర్లో స్థానిక పోలీస్ అధికారులతో లాక్ డౌన్ ను అతిక్రమించి రోడ్లమీదకు వాహనాలపై వచ్చిన వాహనదారులను రోడ్డుపైకి రావడానికి గల కారణాలను అడిగి తెలుసుకోవడంతో పాటు, అనవరంగా రోడ్లపైకి వారిపై పోలీస్ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వారి వాహనాలపై కేసులు నమోదు చేయించి క్షేత్ర స్థాయిలోనే సీజ్ చేయడంతో పాటు, లాక్ డౌన్ అనంతరం వాహనాలను తిరిగి ఆందజేయాల్సిందిగా పోలీస్ కమీషనర్ స్థానిక మట్వాడా ఇన్స్ స్పెక్టర్ గణేశ్ ను ఆదేశించారు.