హన్మకొండ జిల్లా శాయంపేట మండలం మాందారిపేట లో గల కస్తూర్భా బాలికల గురుకుల విద్యాలయంలో పదిమందికి పైగా విద్యార్థినులు కరోనా బారిన పడినట్లు తెలిసింది. ఇంకొంతమంది విద్యార్థులు జలుబు,దగ్గు తో సతమతం అవుతున్నట్లు తెలియవచ్చింది.విద్యార్థులతో పాటు కొంతమంది ఉపాద్యాయులు సైతం కరోనా బారిన పడినట్లు సమాచారం.కాగా శుక్రవారం శాయంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది జరిపిన పరీక్షల్లో ఓ ఇద్దరికి కరోనా పాజిటివ్ గా తేలినట్లు తెలిసింది. వైద్య సిబ్బంది గత రెండు రోజులుగా ఈ పాఠశాలలో పరీక్షలు జరుపుతుండగా రోజుకో ఇద్దరికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అవుతున్నట్లు తెలిసింది.