హన్మకొండ నగరంలోని లష్కర్ బజార్ లోని ప్రధాన రహదారి పక్కన ఉన్న ఆర్థరైటిస్, రుమటిజం ఆసుపత్రి బిల్డింగ్ నిర్మాణం పై అనేక రకాల అనుమానాలు కలుగుతున్నాయి. కేవలం నలభై గజాల స్థలంలో ఇరుకుఇరుకుగా నాలుగంతస్తుల భవనం నిర్మించడం తో మున్సిపల్ అనుమతుల విషయంలో అనేక ప్రశ్నలు వస్తున్నాయి. నగరంలో ఎలాంటి అనుమతులు లేకుండా,నిభందనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఇండ్లను కూల్చివేయిస్తున్న కమిషనర్ ప్రావీణ్య ఈ భవనం పై కాస్త నజర్ వేయాల్సిన అవసరం ఉంది.
రైలు డబ్బాలాగా కేవలం నలభై గజాల్లో జి ప్లస్ ఫోర్ భవనాన్ని నిర్మిస్తే మున్సిపల్ అధికారులు ఎలా చూసుకుంటూ ఉన్నారో అర్థం కావడం లేదు. అసలు జి ప్లస్ పోర్ భవనం కట్టడానికి అనుమతి ఉందా ఇంత తక్కువ స్థలంలో అది నిర్మించడానికి అసలు అనుమతి ఇవ్వవచ్చ అధికారులకే తెలియాలి. కనీస రక్షణ ప్రమాణాలు పాటించకుండా బిల్డింగ్ నిర్మించి ఆసుపత్రి నిర్వహిస్తున్న మున్సిపల్ అధికారులు ఇప్పటివరకు అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. అసలు నలభై గజాల స్థలంలో బహుళ అంతస్తుల భవనం నిర్మించవచ్చా…? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అసలు ఆ ఆసుపత్రి బిల్డింగ్ ప్లాన్ లో ఏముందో మున్సిపల్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తే బాగుంటుందని పలువురు అంటున్నారు. ఇలాంటి చిన్న భవనంలో ఆసుపత్రి నిర్వహణ కొనసాగుతుండగా ఏదైనా జరగరానిది జరిగితే బాద్యులెవరని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించకపోవడం పలు అనుమానాలకు కారణంగా మారుతుంది. ఈ బిల్డింగ్ విషయంలో మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య దృష్టిసారించి అసలు అనుమతులు ఏంటి… నిర్మాణం ఎలా జరిగింది… బహుళ అంతస్తులు నలభై గజాల్లో నిర్మాణం చేయవచ్చో పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.