పాత నేరస్థుల సమాచారాన్ని సేకరించండి -వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి.
గతంలో పోలీస్ స్టేషన్లలో పరిధిలో గంజాయి క్రయ విక్రయాలకు పాల్పడిన నేరస్థులతో పాటు, ఆస్తి నేరాలకు పాల్పడిన నేరస్థుల సమచారాన్ని సేకరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు పిలుపునిచ్చారు.
సెంట్రల్ జోన్ నేరసమీక్షా సమావేశంలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ బుధవారం హన్మకొండ డివిజనల్ పోలీస్ అధికారులతో నెల వారి నేరసమావేశాన్ని నిర్వహించారు. సెంట్రల్ జోన్ డిసిపితో పాటు హన్మకొండ ఏసిపి, ఇన్ స్పెక్టర్లు, సబ్-ఇన్స్ స్పెక్టర్లు పాల్గొన్న ఈ నేర సమావేశంలో పోలీస్ స్టేషన్ వారిగా పెండింగ్ లో వున్న కేసులు, వాటి ప్రస్తుత స్థితిగతులు, నిందితుల అరెస్టు, కేసు దర్యాప్తు సంబంధించి వివరాలను పోలీస్ కమిషనర్ ఆయా స్టేషన్ అధికారులు, సర్కిల్ ఇన్ స్పెక్టర్ మరియు ఏసిపిలను పోలీస్ అడిగి తెలుసుకోవడంతో పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది పనితీరుపై పోలీస్ కమిషనర్ ఈ సమీక్షా సమావేశంలో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ పలు అంశాలపై పోలీస్ అధికారులకు పలుసూచనలు చేశారు.
ప్రతి స్టేషన్ పోలీస్ అధికారి నమోదైన కేసులను పరిష్కరించేందుకుగాను నమోదయిన కేసులను అనుసరించి ప్రస్తుతం అమలులో వున్న ఏస్.ఓ.పి విధానాన్ని అనుసరిస్తు పోలీసు అధికారులు కేసులను పరిష్కరించడం సులభమవుతుందని, ముఖ్యంగా ప్రస్తుతం పెండింగ్ లో వున్న గ్రేవ్ కేసుల పరిష్కరించడం భాగం అధికారులు దర్యాప్తు వేగవంతం చేయడంతో నేరస్తులను పట్టుకొనేందుకుగాను ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, గ్రేప్ కేసుల్లో నిందితుల నేరాన్ని రుజువు చేసేందుకు అవసరమయిన సాక్ష్యాధారాలను సేకరించి కోర్టు సమర్పించాలని, పెండింగ్ లో వున్న పోక్సో కేసుల్లోను దర్యాప్తును వేగవంతం చేయాలని పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించడంతోపాటు, విజుబుల్ పోలీసింగ్ లో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించాలని అదే విధంగా పెట్రోకార్, బ్లూకోల్డ్ మరియు ఇంటర్‌సెప్టార్ సిబ్బంది పనితీరుపై సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు పర్యవేక్షించాలని, గంజాయి, గుడంబా, గుట్కా గ్యాబ్లింగ్ వలన ప్రజలకు జరిగే నష్టాలపై ప్రజలతో పాటు, పోలీస్ స్టేషన్ పరిధిలో విధ్యాసంస్థలతో పాటు, ప్రధాన కూడళ్ళలో అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించాలని, రౌడీ షీటర్ల ప్రస్తుత స్థితి గతులపై ఆరా తీయాలని, ప్రతి పోలీస్ అధికారి తమ పరిధిలో ముందస్తు సమాచారం తెలుసుకోనే విధంగా ఇన్ఫర్మర్ వ్యవస్థను బలోపేతం చేసుకోవడంతో పాటు, చట్ట వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడే వారి సమాచారం అందించే వ్యక్తులకు నజరానాలు అందించడంతో పాటు వారి సమచారాన్ని గోప్యంగా వుంచాలని పోలీస్ కమిషనర్ అధికారులు సూచించారు.
ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డిసిపి అశోక్ కుమార్ హన్మకొండ, కాజీపేట ఏసిపిలు కిరణ్ కుమార్, శ్రీనివాస్, డేవిడ్ రాజు తో పాటు ఇన్ స్పెక్టర్లు, ఎస్.ఐలు పాల్గొన్నారు.