తెలంగాణ రాష్ట్రంలో మే 29 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. కేబినెట్ లో ప్రధానంగా లాక్ డౌన్ పైనే చర్చ జరిగిందన్న ఆయన తెలంగాణలో 439 ఆక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. పకడ్బందీ చర్యల వల్ల కరీంనగర్ లో కంట్రోల్ కు వచ్చిందన్నారు. ఈ రోజు కొత్తగా 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయనీ అన్నారు. వచ్చే పదకొండు రోజుల్లో 18 జిల్లాలు గ్రీన్ జోన్ లో చెరనున్నాయని అన్నారు. జోన్ల విషయంలో కేంద్రం మార్గ దర్శకాలను పాటిస్తునామన్నారు. జీ ఎచ్ ఏం సి పరిధిలో ఇప్పటివరకు 726 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయన్నారు.