ఎట్టకేలకు కుర్చీ రేటు కుదిరిందని గుసగుసలు?
త్వరలోనే ఆ సర్కిల్ కు కొత్త సిఐ?
హుజురాబాద్ నియోజకవర్గంలోనే పనిచేసిన సిఐ కి దక్కనున్న ఆ పోస్టింగ్
రాజకీయ అండదండలు దక్కించుకున్న ఆ సిఐ
ఏదైనా పోలీస్ స్టేషన్ లో పోస్టింగ్ దక్కించుకోవాలంటే రాజకీయ అండదండలు,సిపార్స్ లేఖలు, కావాల్సిన డబ్బులు ఉంటేనే పోస్టింగ్ దక్కుతుందని పోలీస్ శాఖలో ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే… కొందరు అధికారులు ఈ పనులు చేయలేక పోస్టింగ్ లు లేక నెలలు, సంవత్సరాల తరబడి ఎదో ప్రాధాన్యత లేని పోస్ట్ లో కొనసాగుతుంటే… ఇవన్నీ సరిగ్గా మ్యానేజ్ చేసే అధికారులు ప్రాధాన్యత గల పోస్ట్ లో కొనసాగుతున్నారనేది ప్రస్తుతం పోలీసుల్లో కొనసాగుతున్న చర్చ… ఈ పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా పోలీస్ శాఖలో కొనసాగుతుండగా కొంతమంది పోలీస్ ఉన్నతాధికారులు వీటికి అడ్డుకట్టవేయాలని చూస్తున్న రాజకీయ జోక్యం రోజురోజుకు పెరిగిపోతుంది తప్ప తగ్గడం లేదనేది సత్యం.
వరంగల్ అర్బన్ జిల్లాలో సరిగ్గా ఇలాంటి వ్యవహారం ఒకటి నడిచినట్లు ప్రస్తుతం పోలీసుల్లో జోరుగా చర్చ జరుగుతుంది. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ పోస్టుకు హోరాహోరీ పోరు జరుగగా ఎట్టకేలకు కుర్చీ కీ ఓ రేట్ కుదిరిందని సమాచారం. గత ఐదు మాసాలుగా సర్కిల్ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఖాళీనే ఉంది ఈ కుర్చీ దక్కించుకునెదుకు దాదాపు 20 మంది కి పైగా సిఐ ఆశావహులు పోటీ పడ్డారట. హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఈ పోలీస్ స్టేషన్ కు మంచి రెవెన్యూ ఉన్న పోలీసు స్టేషన్ గా గుర్తింపు ఉందట. గతంలో హుజురాబాద్ నియోజకవర్గ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ పని చేసిన ఓ అధికారి కావాల్సింది సమర్పించడం, ఓ ప్రజాప్రతినిధి నుంచి సిపార్స్ లేఖ తేవడంతో పోస్టింగ్ ఖరారు ఐయినట్లు తెలిసింది… అక్షరాల 15 లక్షల రూపాయలు సమర్పించుకొని సదరు సిఐ ఈ పోస్టింగ్ దక్కించుకున్నాడని విశ్వసనీయంగా తెలియవచ్చింది. రానున్న రెండు రోజుల్లో ఆ సిఐ ఇక్కడ పోస్టింగ్ చేపట్టనున్నట్లు సమాచారం తెలిసింది.
ఇక్కడ గతంలో పనిచేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ గత ఐదు మాసాల క్రితం సస్పెండ్ కావడం తో అప్పటి నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ పోస్టు ఖాళీగానే ఉంది…. ఐదు మాసాలుగా ఇక్కడ పోస్ట్ ను ఖాళీగా పెట్టి ఇప్పుడు ఇక్కడ ఓ సిఐ కి పోస్టింగ్ ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది… ఐదు మాసాలుగా ఈ సర్కిల్ లో పనిచేసేందుకు అసలు అధికారే దొరకలేదా … అనే ప్రశ్న తలెత్తుతుంది… కావాల్సింది సమర్పించేవారు దొరికే వరకు ఈ పోస్ట్ ను ఖాళీగా ఉంచారని ఆరోపణలు వస్తున్నాయి… కేవలం మంచి రెవెన్యూ ఉన్న పోలీస్ స్టేషన్ అయినందున పోస్టింగ్ కావాల్సిన సిఐలు కొంతమంది అధికార పార్టీ నేతను ప్రసన్నం చేసుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేశారని తెలిసింది… ఆ ప్రజాప్రతినిధి ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఆ సర్కిల్ ఐదు మాసాలుగా అధికారి లేకుండానే ఉంది… ఎట్టకేలకు హుజురాబాద్ నియోజకవర్గం లో పని చేస్తున్న ఓ అధికారి కి పోస్టు దక్కడంతో ప్రజాప్రతినిధి ద్వారా ప్రయత్నం చేసిన సదరు సిఐలు అందరు పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలిసింది…. పోలీస్ శాఖలో రాజకీయ జోక్యం ఎంతగా మితిమిరిపోతుంది… పోస్టింగ్ ల్లో డబ్బు ప్రభావం ఏవిదంగా ఉందో చెప్పడానికి ఇది కేవలం ఓ మచ్చు తునక మాత్రమే….