కార్ పాస్ తెచ్చిన తంటా

మంచిర్యాల ఏసీపీ డిజిపి కార్యాలయానికి అటాచ్

తన స్నేహితుడు పోలీస్ శాఖ నుంచి పాస్ ను పొంది హైద్రాబాద్ మహానగరంలో తిరుగుతుంటే, తాను కూడా అలాగే తిరగాలనుకున్నాడు ఓ వ్యక్తి. తన మిత్రుణ్ణి సంప్రదించి కార్ పాస్ ఎలా సంపాదించాడో ఆరా తీసాడు. విషయం తెలిసిన వెంటనే రాచకొండ పోలీస్ కమిషనర్ ను కలిసి తనకు కార్ పాస్ కావాలని అడిగాడట. అది సాధ్యం కాదని పోలీస్ అధికారి చెప్పాడు. ఎందుకు సాధ్యం కాదంటూ మంచిర్యాల ఏసీపీ తన మిత్రుడికి జారీ చేసిన విషయం సదరు వ్యక్తి కమిషనర్ దృష్టికి తీసుకు వచ్చాడట అక్కడ సాధ్యం… ఇక్కడెలా కాదంటూ ప్రశ్నించాడట. ఇంకేముంది లాక్ డౌన్ వేళా నిబంధనలకు విరుద్ధంగా పాస్ తో నగరంలో తిరుగుతున్న అతగాడి మిత్రుని కార్ ను పోలీసులు వెతికి పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు.

కార్ పాస్ తెచ్చిన తంటా- news10.app

డిజిపికి అటాచ్

నిబంధనలకు విరుద్ధంగా ఓ వ్యక్తికి కార్ పాస్ జారీ చేసిన మంచిర్యాల ఏ సిపి పై పోలీసు అధికారులు చర్యలు తీసుకున్నారు.ఏసీపీ విధుల నుంచి తప్పించి డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు.

పాస్ కు రిఫ్రిజిరేటర్ బహుమానం..?

లాక్ డౌన్ వేళా మహా నగరంలో తిరిగేందుకు పాస్ జారీ చేసినందుకు మంచిర్యాల ఏసీపీ కి పాస్ పొందిన వ్యక్తి రిఫ్రిజిరేటర్ బహుమతిగా ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.పాస్ కోసం రాచకొండ కమిషనర్ వద్దకు వెళ్లిన వ్యక్తే ఈవిషయాన్ని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పోలీస్ అధికారులు ఏసీపీ వ్యవహారం పై సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here