గులాబీపై కమలం ఎఫెక్ట్….!

హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితం తర్వాత గులాబీ బాస్ లో చాలా మార్పు వచ్చినట్లే కనపడుతుంది. ఓటమి తర్వాత పార్టీ వ్యవహారాలు,నేతల తీరు తదితర అంశాలపై దృష్టి పెడుతున్న అధినేత ముందుగా ఇంటిని సరిచేయాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఇంటిని సరి చేయాలంటే కీలక నేతలు, సీనియర్ లల్లో అసంతృప్తి లేకుండా చూడాలి. ఇందులో భాగంగానే గులాబీ అధినేత ఇటీవల ఎమ్మెల్సీ పదవులు కీలక నేతలకు, సీనియర్ లకు కట్టబెట్టారు. అంతేకాదు వీరిలో కొందరికి మరింతగా ప్రమోషన్ ఇచ్చి మంత్రివర్గంలో సైతం చోటు కల్పించనున్నట్ట్లు గులాబీలో అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీ లుగా ఉన్న ఓ ఇద్దరు సీనియర్ లకు మంత్రి పదవులు ఇచ్చి పార్టీని మరింత బలోపేతం చేసి నాయకులను గాడిలో పెట్టి 2023 కి మరింత బలంగా మారాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలిసింది.

గులాబీపై కమలం ఎఫెక్ట్....!- news10.app

కమలం ఎఫెక్ట్….

ఎంతకాదన్న తెలంగాణలో కాంగ్రెస్ కంటే ఎక్కువగా బీజేపీ పైనే అధినేత తన ఫోకస్ అంత పెట్టినట్లు కనపడుతుంది. గతంలో అసలు బిజెపి మాకు పోటీయే కాదన్న కేసీఆర్ కమలం ఎఫెక్ట్ తో ఇప్పుడు పార్టీని చక్కదిద్దే పనిలో ఉన్నట్లు కనపడుతుంది. చాపకిందనీరులా బీజేపీ పాకిపోతుందని గులాబీ అధినేత భావించి దిద్దుబాటు చర్యలు కాస్త వేగంగానే మొదలుపెట్టినట్లు గులాబీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.

నామినేటెడ్ భర్తీలు…?

తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఏ ఒక్క నామినేటెడ్ పదవిని త్వరగా భర్తి చేసిన దాఖలాలు లేవు. ఈ విషయాన్ని గులాబీ శ్రేణులు సైతం బహిరంగంగానే ఒప్పుకుంటారు. దీనివల్ల నామినేటెడ్ పై కాస్తో కూస్తో ఆశలు పెట్టుకున్న వారిలో అసంతృప్తి రోజురోజుకు పెరుగుతున్నట్లు అధినేత సైతం గుర్తించినట్టు తెలిసింది. ఇతర పార్టీల్లోకి ముఖ్యంగా బీజేపీలోకి వలసలు పోకుండా నివారించడానికి త్వరలోనే నామినేటెడ్ పదవులన్నింటిని భర్తీ చేసి నాయకుల్లో అసంతృప్తి పోగొట్టాలని అధినేత భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. కాగా ప్రస్తుతం పదవుల్లో కొనసాగుతున్న వారి పనితీరు ను సైతం తెలుసుకొని పనితీరు సరిగా లేనివారికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి గులాబీ పై కమలం ఎఫెక్ట్ బాగానే పడినట్లు అధినేత స్పీడును తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి తెలుస్తుంది. ఎఫెక్ట్ విషయం ఎలాఉన్నా అధినేత తీసుకుంటున్న నిర్ణయాలతో గులాబీలో కాస్త ఉత్సాహం పెరుగుతుందట… కేసీఆర్ ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని ఎదురు చూస్తున్నారుట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here