ప్రభుత్వ భూములు ప్రయివేటు వ్యక్తుల పరం అవుతున్న ఆ రెవెన్యూ అధికారి తనకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి….సర్కార్ భూమి మాయం అవుతున్న ఆ తహశీల్దార్ ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావడం లేదని పలువురు విమర్శిస్తున్నారు… హన్మకొండ న్యూ శాయంపేట లోని 127 సర్వే నంబర్ లో ఉన్న సర్కార్ భూమిని ఓ బట్టలవ్యాపారి మింగేసాడని ఆరోపణలు వినిపిస్తున్న ఖాజీపేట తహశీల్దార్ తనకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని తెలిసింది… సదరు బట్టల వ్యాపారి 15 గుంటల ప్రభుత్వ భూమిని తన పరం చేసుకునేందుకు తనకున్న పట్టా భూమి పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కలిపేసుకొని ఓ భారీ నిర్మాణాన్ని చేపడుతున్న ఇది అక్రమం అని తెలిసిన తహశీల్దార్ చర్యలు తీసుకొకపోవడం కనీసం ప్రభుత్వ భూమిని కాపాడే ప్రయత్నం చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ప్రభుత్వ భూమిని కబ్జా చేసాడని ఆరోపణలు వస్తున్న బట్టల వ్యాపారికి రాజకీయంగా పెద్ద పరపతి ఉండడంతోనే… రాజకీయ ఒత్తిళ్ల మూలంగా తహశీల్దార్ చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారనే ఆరోపణలు సైతం వస్తున్నాయి… బట్టల వ్యాపారికి రాజకీయ అండ ఉండడం వల్లే ప్రభుత్వ భూమి ని కాపాడకుండ రెవెన్యూ అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి… ఆ బట్టల వ్యాపారికి పరపతి ఉండడం వల్లప్రభుత్వ భూమినీ కబ్జా చేసిన రెవెన్యూ అధికారిచూసి చూడనట్లు వదిలేస్తున్నారని అంతేకాదు ప్రభుత్వ భూముల కబ్జా విషయంలో ఫిర్యాదులు చేసిన తహసీల్దార్ ఏమాత్రం స్పందించడం లేదనే ప్రచారం సాగుతోంది..…
విలువైన భూమి…?
తన బట్టల వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు ఆ వ్యాపారి ప్రభుత్వానికి చెందిన 15 గుంటల భూమిని కబ్జా చేయగా ఆ భూమి విలువ సుమారు మూడు కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని సమాచారం…. ఇంత విలువైన ప్రభుత్వ భూమిని ఆ బడా వ్యాపారి కబ్జా పెట్టిన కనీసం అక్కడ ఏం జరుగుతోందో తహశీల్దార్ తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదని తెలిసింది…. భూమి లేని నిరుపేదలు ఎవరైనా ప్రభుత్వానికి చెందిన గజం భూమిలో చిన్న గుడిసె వేసుకున్న ఆఘమేఘాల మీద అక్కడకు చేరుకుని గుడిసెను తొలగించి కేసులు నమోదు చేసే రెవెన్యూ అధికారులు ఆ వ్యాపారి విషయంలో మాత్రం ఎక్కడ లేని సానుకూలతను ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తుంది.
తహశీల్దార్ మొదలుకొని కింది స్థాయి సిబ్బంది వరకు అసలు సర్కారు భూమి ఎక్కడ కబ్జా జరగనట్లు ప్రవర్తిస్తున్నారు….ఇది కేవలం రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే జరుగుతుందని ఆ వ్యాపారి కబ్జా చేసినట్లు ఆరోపణలు వస్తున్న 15 గుంటల భూమిని అతగాడికి అప్పగించే ప్రయత్నం జరుగుతుందని , అంతటి విలువైన ప్రభుత్వ భూమి వ్యాపారి కబ్జా చేసిన రెవెన్యూ అధికారులు చూసిచూడనట్లు వదిలేస్తున్నారని తెలుస్తుంది… ఏదిఏమైనా ఇకనైనా 127 సర్వే నంబర్ లో ఉన్న 15 గుంటల ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా రెవెన్యూ అధికారులు చర్యలు మొదలుపెడతార…?ప్రభుత్వ భూమి ప్రయివేట్ వ్యక్తి పరం అవుతున్న వేడుక చూస్తారా…? వేచిచూడాలి….