నర్సంపేట డివిజన్ లోని గ్రామాల్లో బెల్టుషాపుల హవా కొనసాగుతోంది

నర్సంపేట డివిజన్ లోని గ్రామాల్లో బెల్టుషాపుల హవా కొనసాగుతోంది. దాదాపు అన్ని గ్రామాలలో ఈ బెల్ట్ షాపులు తమ హవా కొనసాగుతుండగా మద్యం వ్యాపారులు సిండికేట్ గా మారి రేట్లు పెంచేసి బెల్ట్ షాపులకు విక్రహిస్తున్నారు.దింతో బెల్టు షాపుల నిర్వాహకులు మరింత పెంచేసి మద్యం ప్రియుల జేబుకు చిల్లు పెడుతున్నారు. నర్సంపేట డివిజన్ లోని చెన్నారావు పేట మండలంలోని గ్రామాల్లో బెల్టు షాపుల దందా మరింత జోరుగా కొనసాగుతుంది.మద్యం వ్యాపారులు బాటిల్ పై ఎమ్మార్పీ రేట్ కన్న 20 రూపాయలు బెల్ట్ యజమానుల నుంచి వసూలు చేస్తుండగా బెల్ట్ వ్యాపారులు మరో 20 పెంచేసి బాటిల్ పై 40 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. మద్యం వ్యాపారులు సిండికేట్ గా మారి బెల్ట్ షాపులకు విక్రహిస్తుండగ చెన్నారావుపేట స్థానికులు బెల్ట్ షాపులపై ఆగ్రహం వ్యక్తం చేసి బెల్ట్ షాపులు విక్రహించకూడదని నిర్ణహించారు.దింతో బెల్ట్ వ్యాపారులు అమ్మకాలను నిలిపివేశారు. అమ్మకాలు తగ్గడంతో మద్యం వ్యాపారులు మండలంలోని గ్రామాల్లో బెల్ట్ వ్యాపారాన్ని నిర్వహిస్తూన్నారు.

నర్సంపేట డివిజన్ లోని గ్రామాల్లో బెల్టుషాపుల హవా కొనసాగుతోంది- news10.app

బెల్టుషాపుల తీరిది…

నర్సంపేట డివిజన్ పరిధిలోని చెన్నారావుపేట మండలంలో మద్యం వ్యాపారులదే ఆడిందే ఆట పాడిందే పాట గా కొనసాగుతుంది.మద్యం వ్యాపారుల టార్గెట్ అయిపోయినందున ఎంత అమ్మినా నా దొరికేది అరకోర కనుక వీరు మద్యం సిండికేట్ కు తెరలేపారు. ఈ మద్యం సిండికేట్ ను అడ్డుకునే వారే లేక మద్యం వ్యాపారులు రెచ్చిపోతున్నారు.ముక్యంగా చెన్నారావుపేట తిరుమల వైన్ షాప్ యజమానులైతే దర్జాగా ఎమ్మార్పీ ధర కంటే 20 రూపాయలు అదనంగా అమ్ముతున్నారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే కొంటె కొను లేకపోతే లేదు ఎక్కడ చెప్పు కుంటావో చెప్పుకో అంటు మద్యం ప్రియులను బెదిరిస్తున్నారట.

కూలీనాలీ చేసి సాయంత్రం పూట సేదతీరేందుకు ఒక క్వార్టర్ మందు తాగుదామా అనుకునే మందుబాబుల జేబులకు చిల్లులు పడేలా చేస్తుండగా, చేసేది ఏమీ లేక వారు చెప్పిన రేటుకే మందుబాబులు మద్యం కొనుగోలు చేస్తున్నారు.ఇలా మద్యం వ్యాపారులు మందుబాబుల జేబులకు చిల్లులు పడేలా చేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్ శాఖ మాత్రం మామూళ్ల మత్తులోఉందని స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.