అమ్మాయిల మద్యం ‘బెల్ట్’

మద్యం అమ్మకాలలో బెల్ట్ ద్వార ఆరితేరిన అమ్మాయిలు
యువతులకు మద్యం సరఫరా చేస్తూ బెల్ట్ లో అమ్మిస్తున్న వైన్స్ యజమానులు
అడ్డగోలు ధరలు …ఇదేంటని ప్రశ్నిస్తే అమ్మాయిల బూతు పురాణం
ఎదురుతిరిగితే మద్యం ప్రియులపై భౌతిక దాడులు
కాశిబుగ్గ లక్ష్మి పురంలో బెల్టులన్ని అమ్మాయిలవే…

అమ్మాయిల మద్యం 'బెల్ట్'- news10.app

అక్కడ బెల్ట్ షాపులు నిర్వహించేదంత అమ్మాయిలే … రోడ్ పై నిల్చొని మద్యం ఉంది రండంటూ… పిలుస్తారు అడ్డగోలు రేటుకు మద్యం అమ్ముతారు ఇదేందని.. ప్రశ్నిస్తే తాట తీస్తారు.. ఎదురుతిరిగితే బూతు పురాణం అందుకుంటారు. మందు తాగుదామని వెళ్తే అసలు సంబంధం లేని అమ్మ… ఆలీని వరుస పెట్టి తిట్టేస్తారు రాళ్ళు, ఖాళీ సీసాలు, కర్రలతో దాడి చేస్తారు అసలే మద్యం తాగడానికి వెళ్లారు ఆపై దాడికి గురైయ్యారు ఎక్కడైనా చెపితే పరువు పోతుంది. అందుకే పాపం మద్యం ప్రియులు గమ్మునుంటారు. కొందరు ధైర్యం చేసి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కితే అసలే అమ్మాయిలు కేసు వేరె విషయానికి దారితీస్తుంది. ఇదంతా ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో జరుగుతున్న తతంగం కాదు. వరంగల్ నగరంలోని కాశిబుగ్గ లక్ష్మీపురం లో జరుగుతున్న అమ్మాయిల బెల్ట్ దందా తీరిది. ఈ ప్రాంతం లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒకే గల్లీలో ఆరు బెల్టు షాపులు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. పోలీసులు గాని ఎక్సైజ్ శాఖ కానీ ఇప్పటివరకు ఇదేందని వీరిని ప్రశ్నించిన పాపాన పోలె మద్యం మత్తులో ఏదయినా జరగరానిది జరిగితే హడావుడి చేసే పోలీసులు విరినైతే ప్రస్తుతానికి అమ్ముకోనియి… అన్నట్లుగానే వదిలేశారు.

అమ్మాయిల బెల్ట్ దందా…

కాశిబుగ్గ లక్ష్మీపురం లో అపార్టుమెంట్లు ,ఇతర నివాస ప్రాంతాల మధ్య ఈ బెల్ట్ దందా జోరుగా కొనసాగుతుంది. ఐయితే దీని ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్న ఆరు బెల్ట్ షాపుల్లో అమ్మాయిలే మద్యాన్ని విక్రహిస్తారు. పోసింది తాగాలి.. అడిగినంత డబ్బులు ఇవ్వాలి ఎదురు ప్రశ్నించకూడదు అలా జరిగిందో భౌతిక దాడి తప్పదు. ఇటీవల కొంతమంది యువకులు ఇక్కడ మద్యం తాగి అక్కడ ఉన్న బ్రాండ్, ధరల గూర్చి ప్రశ్నిస్తే పెద్ద యుద్ధమే జరిగినట్లు తెలిసింది. మద్యం విక్రహించే అమ్మయిలు వారిపై దాడి చేశారు. ఈ విషయం పొలీస్ స్టేషన్ వరకు వెళ్లిన అంతగా ఎం జరగలేదు బెల్ట్ అమ్మకాలు మాత్రం యధావిధిగా జరుగుతున్నాయి. రాత్రి పగలు అని తేడా లేకుండా ఇక్కడ అమ్మకాలు కొనసాగుతుండగా ధరల విషయంలో మద్యం ప్రియుల టాప్ లేచిపోతుంది. క్వాటర్ పైన సమయాన్ని బట్టి వంద నుంచి రెండువందల వరకు వారి ఇష్టారీతిన అమ్మేస్తున్నారు.

బారు ను తలపిస్తాయి

సాయంత్రం ఐయిందంటే చాలు లక్ష్మీపురం ప్రాంతం మద్యం ప్రియులతో కిక్కిరిసి పోతుంది. చిన్న చిన్న గుడిసెల్లో, రేకుల షెడ్డు కింద ఎక్కడ చూసినా జనమే కనబడుతారు. వాహనాల పార్కింగ్ కు సైతం స్థలం దొరకదు. మద్యం తాగే బెల్ట్ షాప్ ముందు తప్ప ఎక్కడ పార్క్ చేసిన వాహనం తీయమని వేరే బెల్ట్ షాప్ నిర్వాహకులు గొడవకు దిగుతారు. సాయంత్రం ఐతే చాలు ఇక్కడి బెల్ట్ షాపులన్ని బార్ షాపులను తలపిస్తాయి. అసలే కరోన కాలం అయిన ఎంతమాత్రం భయం లేకుండా అమ్మయిలు తమ ఇష్టారీతిన మద్యం విక్రహిస్తున్నారు. సాయంత్రం ఐయిందంటే బెల్ట్ షాపుల వల్ల ఇక్కడ గొడవలు సర్వసాధారణంగా మారాయని స్థానికులు అంటున్నారు.

ఎక్సైజ్ ఎక్కడా…?

నగరం నడిబొడ్డున ఒకే గల్లీ లో ఆరు బెల్టుషాపులు నిర్వహిస్తున్న, మద్యం ప్రియుల జేబులు అధిక ధరలతో గుల్ల చేస్తున్న ఎక్సైజ్ అధికారులు జాడ లేకుండా పోయారు. అమ్మితే అమ్మని సేల్స్ పెరుగుతుంది కదా… అన్నట్లు ఉన్నారుతప్ప చర్యలు తీసుకుందామనే ఆలోచన మాత్రం వీరికి ఉన్నట్లు కనిపించడం లేదు. దింతో స్థానికుల్లో ఆగ్రహం కలుగుతోంది. అటు పోలీసులు ఇటు ఎక్సైజ్ అధికారులపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.