కబ్జా కోరల్లో బీరన్న ఆలయ భూమి..! ……

  • రూ.10కోట్ల విలువ చేసే భూమి పై దళారుల కన్ను…?
  • ఆలయ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్న అక్రమార్కులు
  • భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాలని కోరుతున్న ఆలయ పరిరక్షణ కమిటీ
  • పట్టించుకోని జిల్లా అధికార యంత్రాంగం …
  • కలెక్టర్ కు నివేదిక సమర్పించిన కానరాని చర్యలు

దేవాదాయ ధర్మాదాయ శాఖ కు చెందిన భూమి అన్యాక్రాంతం అవుతున్న పట్టించుకునే నాథుడు కరువయ్యాడనె విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న వరంగల్ భూపాలపట్నం జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న వరంగల్ మండలం ఆరెపల్లి బీరన్న దేవాలయం పై కబ్జాదారులు కన్నువేసి కోట్ల రూపాయల విలువ చేసే భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారని ప్రజలు పేర్కొంటున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి గ్రేటర్ వరంగల్ మూడవ డివిజన్ ఆరెపల్లి లోని వీరన్న దేవాలయం కు దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో సర్వేనెంబర్ 485, 485/ఏలో మొత్తం 15 గంటల స్థలం ఉంది .ప్రభుత్వ రికార్డుల్లో కూడా దేవాదాయ శాఖ కు చెందిన భూమిగా నమోదు అయినప్పటికీ కొంతమంది దళారులు భూమిపై కన్నేశారు.

కబ్జా కోరల్లో బీరన్న ఆలయ భూమి..! ......- news10.app

కొన్ని సంవత్సరాల క్రితం ఈ భూమి లో కొంత స్థలమును ఆక్రమించి కొంతమంది అక్రమ నిర్మాణాలు చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో బీరన్న ఆలయ పరిరక్షణ కమిటీ సభ్యులు గత నెల 21వ తేదీన వరంగల్ జిల్లా కలెక్టర్ కు సైతం రూ.10 కోట్ల ఆలయ భూమి అన్యాక్రాంతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, అక్రమ నిర్మాణాలను తొలగించాలని కోరింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశానుసారం వరంగల్ మండల రెవెన్యూ అధికారులు కూడా ఆలయ భూమిపై సర్వే చేపట్టి కొన్ని అక్రమ నిర్మాణాల ను గుర్తించి జిల్లా కలెక్టర్ కు నివేదిక సమర్పించ నున్నట్లు తెలిసింది. ఇటు రెవెన్యూ అధికారులు, అటు దేవాదాయశాఖ అధికారులు ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటున్న క్రమంలో కూడా ఆలయ భూమి లో నిర్మాణాలు ఆగడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ఆలయ భూమిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న ఆలయ పరిరక్షణ కమిటీ సభ్యులను కూడా కబ్జాదారులు భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు భక్తులు పేర్కొంటున్నారు .ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం వెంటనే స్పందించి కోట్ల విలువ చేసే భూమిని కబ్జాదారుల నుంచి రక్షించాలని ప్రజలు భక్తులు, కోరుతున్నారు. .

కబ్జాదారుల నుండి ఆలయ భూమి నీ రక్షించాలి…..

బీరన్న ఆలయ భూమి అన్యాక్రాంతం కాకుండా కబ్జాదారుల నుండి రక్షించాలని బీరన్న ఆలయ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు దయ్యాల వేణు, సభ్యులు మంగ నరసయ్య, బుర్రి చిన్న చేరాలు, కోరే మహేందర్ కోరారు. ఆలయ భూమిని కొంతమంది దళారులు ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారని, వాటిని వెంటనే నిలిపివేసి ఆలయ భూమిని కాపాడాలని కలెక్టర్ కు విన్నవించాము. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here