కొలువుకు పోయేది లేదు… ఆసుపత్రిలో ఉండేది లేదు
ప్రభుత్వ ఆయర్వేద వైద్యుల ప్రైవేట్ దందా
జీతం ప్రభుత్వ ఆసుపత్రిలో….. వైద్యం సొంత ఆసుపత్రిలో…
ఓ వైద్యుడిది తాటికొండ లో డ్యూటీ… వైద్యమేమో హన్మకొండలో…?
దామెర కుంట డ్యూటీ డాక్టర్… భూపాలప ల్లిలో ఆసుపత్రి నిర్వహణ?
90 శాతం ఆయుర్వేద డాక్టర్లు డ్యూటీ చేయర ని గ్రామాల్లో జోరుగా ప్రచారం
అడిగే వారు లేరు …. అడిగే ధైర్యం ఎవరూ చేయరు…
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఆయుర్వేద డాక్టర్లు.
వారు పేరుకే ప్రభుత్వ ఆయుర్వేద వైద్యులు… కొలువు దక్కిన నాటినుంచి ఇప్పటివరకు ప్రభుత్వ ఆసుపత్రి మొహం చూసిన పాపాన పోలేదు…. వేలకు వేల జీతం వేళకే అందుకుంటారు కానీ విధులకు మాత్రం నిత్యం ఎగనామం పెడుతుంటారు… గ్రామాల్లో ,మండల కేంద్రాల్లో లక్షలు వెచ్చించి ఆయుర్వేద వైద్యం కోసం ఆసుపత్రులకు పక్క భవనాలు నిర్మించిన ఉద్యోగం చేస్తున్న వైద్యులు మాత్రం ఆ ఆసుపత్రుల వైపు కూడా వెళ్లడం లేదట… ఆయుర్వేద ఆసుపత్రి, ఆ ఆసుపత్రుల్లో డాక్టర్ లు ఉన్నారని తెలుసు కానీ వారిని మాత్రం తామెప్పుడు చూడలేదని ఆసుపత్రులు ఉన్న ప్రజలు అంటున్నారు…. అంటే పేరుకే ఆసుపత్రి తప్ప అందులో కొలువు చేసే వైద్యులు మాత్రం కొలువుకు రారన్న మాట.
కొలువు సర్కారులో… పని ప్రైవేట్ లో
వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయుష్ శాఖలో ఆయుర్వేద వైద్యులుగా 25 మంది ఉద్యోగం చేస్తున్నారు. వీరిలో దాదాపు తొంభై శాతం మంది అసలు ఆసుపత్రుల మొహం చూడడం లేదనే విమర్శలు ఉన్నాయి. నెల నెలా వేలకు వేలు జీతాలు తీసుకుంటున్న వీరు మాత్రం విధులకు హాజరు కాకుండా ఎగనామం పెట్టి తమను అడిగే వారు ఎవరు అన్నట్లు వ్యవహరిస్తున్నారట… విధులకు ఎందుకు హాజరు కావడం లేదని ఎవరైనా ప్రశ్నిస్తే ఏవో సాకులు, వింత వింత లాజిక్ లు మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం చేస్తారట… వీరిలో మహిళ వైద్యులు సైతం ఉన్నారు.. వీరిని ప్రశ్నిస్తే చేస్తున్న తప్పులను కప్పి పుచ్చుకునేందుకు మహిళను అనే సాకును చూపుతారట. మరి వీరు చేస్తున్న ప్రభుత్వ కొలువుకు పోకుండా ఎం చేస్తున్నారని అనుమానం వస్తుంది కదా… ఏమి లేదు జీతం అందుకుంటున్న ఉద్యోగానికి వీరు వెళ్లకుండా మరింత అదనపు సంపాదన కోసం ప్రయివేటు ధవాఖానాలు నడుపుతూ వాటికే తమ సమయాన్ని అంతా కేటాయిస్తున్నారట…. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం తాటికొండలో వైద్యుడిగా విధులు నిర్వహించాల్సిన ఓ వైద్యుడు హన్మకండలోని జులైవాడలో ప్రయివేట్ క్లినిక్ నడువుతుండగా…. మరో వైపు జయశంకర్ జిల్లా కాటారం మండలం దామెర కుంట ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో పని చేయాల్సిన ఓ వైద్యురాలు భూపాలపల్లి పట్టణంలో ఓ పెద్ద ప్రైవేట్ ఆసుపత్రిని నడుపుతున్నట్లు తెలిసింది మచ్చుకు ఈ ముగ్గురు వైద్యులు ఉన్న కొలువుకు ఎగనామం పెట్టి ప్రైవేట్ క్లినిక్ లు పెట్టి దండిగా సంపాదిస్తున్న దాదాపు ఆయుష్ శాఖలో ఉద్యోగం చేస్తున్న ఆయుర్వేద వైద్యులందరు ప్రైవేట్ క్లినిక్ లు నడుపుతూ అసలు ప్రభుత్వ ఆసుపత్రుల వైపే వెళ్లడం లేదని ఆరోపణలు ఉన్నాయి.
ఉద్యోగం చేయకుంటే ఎలా…?
ఆయుష్ శాఖలో ఆయుర్వేద వైద్యులు గా ఉద్యోగం చేసేవారు విధులకు హాజరు కాకుండా ఎలా మేనేజ్ చేస్తున్నారనేది ప్రస్తుతం ప్రశ్నగా మారింది. నెలల తరబడి ఆసుపత్రి వైపే వెళ్లకుండా ప్రైవేట్ క్లినిక్ లే పరిమితం ఐయే వీరు ఉద్యోగానికి వెల్తున్నట్లు ఎలా మ్యానేజ్ చేస్తున్నారు… నెలల కొద్దీ ఉద్యోగానికి హాజరు కాకుండా హాజరైనట్లు రికార్డ్ ల ద్వారా వేతనం ఎలా పొందుతున్నారు…నెలల తరబడి ఆసుపత్రికి పోకున్న,ఆసుపత్రి అసలు ఓపెన్ చేయకున్న ఉన్నతాధికారులు వీరిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు…. అనే ప్రశ్నలు వస్తున్న ఇలా ఉద్యోగానికి ఎగనామం పెడుతూ ప్రైవేట్ క్లినిక్ లు నడుపుతున్న వీరంతా తమ పై అధికారులను ప్రసన్నం చేసుకోవడం వల్ల విధులకు హాజరైన,కాకున్నా నడుస్తుందని తెలుస్తుంది…కొందరు వైద్యులైతే తమ కింది స్థాయి ఉద్యోగులను మేనేజ్ చెసుకుంటు…ఒకే సారి హాజరు పట్టికలో సంతకాలు పెడుతూ అటు కొలువును కాపాడుకుంటూ…ఇటు ప్రయివేటు క్లినిక్ లు నడుపుకుంటు రెండు చేతులా సంపాదిస్తున్నారని తెలుస్తోంది.
ఇంగ్లీష్ వైద్యం….
ఆయుర్వేదిక్ వైద్యులుగా పట్టా ఉన్నా ఈ వైద్యులంతా ఆయుర్వేదాన్ని పక్కన పెట్టి అల్లోపతి వైద్యాన్ని చేస్తున్నట్లు తెలిసింది. అందరూ ఆయుర్వేద వైద్యులు తమ ప్రైవేట్ క్లినిక్ లో ఇంగ్లీష్ వైద్యాన్ని కొనసాగిస్తు…. ఇంగ్లీష్ మందులే రాస్తూ వైద్యం చేస్తున్నారట… ఇది నిబంధనలకు విరుద్ధం ఐయిన గత కొద్ది సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యులందరు అల్లోపతి వైద్యాన్ని చేస్తూ మంచిగానే దండుకుంటున్నారట. ఇంత జరుగుతున్నా వైద్యశాఖ అధికారులు కనీసం తనిఖీలు చేయకుండా పెద్ద పెద్ద ఆసుపత్రులు వీరి ఆధ్వర్యంలో నడుస్తున్న చూస్తున్నారు తప్ప కనీసం చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.