కరోన వ్యాధి నిర్దారిత పరీక్షలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఏస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన కరోనపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆయన వివరించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 74వేల 551 కరోన టెస్టులు నిర్వహించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచామన్నారు.
సగటున 1396 పరీక్షలు జరుగుతున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా 9 ల్యాబుల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. మొత్తం మీద ప్రతి లక్ష జనాభాకు1396 పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. కరోన పట్ల అనవసర భయాందోళనలు అవసరం లేదని కొన్ని జాగ్రత్తలు తీసులుంటే నయం అవుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో కరోనతో కలిసి జీవించాల్సిదేనని,కరోన ఓ జ్వరం లాటిదేనని జగన్ అన్నారు. ఎంతచేసిన కరోనాను కట్టడి చేయలేమన్న ఆయన ఈ నెల నుంచి టెస్టింగ్ కెపాసిటీ ఇంకా పెంచుతామన్నారు.