విప్లవోద్యమ పురోభివృద్ధిని కాంక్షించిన విప్లవ మిత్రురాలు……

కాకరాల సూర్యకాంతం మృతికి సంతాపం తెలిపిన మావోయిస్టు కేంద్ర కమిటీ
మీడియాకు లేఖ విడుదల చేసిన అధికార ప్రతినిధి అభయ్
లేఖ పూర్తి పాఠం యధాతదంగా….

కామ్రేడ్ కాకరాల సూర్యకాంతం గారు (82) మార్చి 18 న గురువారం కొండపూర్ లోని సి.ఆర్ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో గుండె
సంబంధిత అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారని, ఆమె కోరిక మేరకు కండ్లను ఎల్ వి ప్రసాద్ కంటి ఆస్పత్రికి, భౌతిక కాయాన్ని ఉస్మానియా
మెడికల్ కాలేజికి అందజేశారని పత్రికల ద్వారా తెలిసింది.

విప్లవోద్యమ పురోభివృద్ధిని కాంక్షించిన విప్లవ మిత్రురాలు......- news10.app

శ్రీమతి సూర్యకాంతం గారికి చిన్నతనంలోనే కాకరాల వీర వెంకట సత్యన్న కాంతం గారితో వివాహమయ్యింది. గరికపాటి రాజారావు
శిష్యుడుగా కమ్యూనిస్టు భావాలతో ఉన్న కాకరాల సినీరంగంలో సీనియర్ కళాకారుడు. విరసం, జెఎఎమ్ ల ద్వారా విప్లవ రాజకీయాలతో
సన్నిహితంగా ఉండేవారు.

కాకరాల గారి సహచర్యంలో కమ్యూనిస్టు విలువలు తెలుసుకున్న సూర్యకాంతం గారు విప్లవ రాజకీయాలతో సన్నిహితమై పిల్లలను
విలువలతో పెంచారు. వాళ్ళు పెద్ద వాళ్ళయి విప్లవ మార్గాన పని చేయాలనుకున్నప్పుడు తల్లితండ్రులు ఇద్దరూ ప్రోత్సాహించారు.
శ్రీకాకుళ పోరాట కాలం నుండి విప్లవకారులకు వివిధ రూపాలలో సహకరించడంతో పాటు, బహిరంగ కార్యకలాపాలకు హాజరవుతూ
తమ నిబద్ధతను కాపాడుకుంటూ వచ్చారు. తమ దగ్గర పిల్లలు లేకపోయినా అందరిని తమ పిల్లలుగానే భావించి ఆదరించారు.విప్లవోద్యమంలో వారికి అటువంటి పిల్లలు అనేక మంది ఉన్నారు. వృద్ధాప్యంతో, అనారోగ్యంతో వారే ఇద్దరికి సహకరించారు
.
అమ్మ గురించి ఇద్దరు అమ్మాయిలు

అమ్మ గురించి, అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచంలో అమ్మ మీద అమ్మ ప్రేమ మీద ఎంతో సాహిత్యం,ఎన్నో భాషల్లో హృద్యంగా, అర్థంగా వచ్చినా గానీ, అవి ఆసంపూర్ణమే. సృష్టిలో మారృత్వం అనేది ఎంతో అపురూపమైనది. సహజమైనది.

| స్వచ్ఛమైనది. తీయనైనది. భూమి పై జన్మించిన ప్రతి శిశువు వెనక అమ్మ పడ్డ ప్రసవ వేదన వుంది. కడుపులో బిడ్డ రూపం దిద్దుకునే
| క్షణం నుంచీ, తల్లి ఆలోచనలు, ఆచరణ అంతా రూపం దిద్దుకోని ఆ శిశువు కోసమే, ప్రాణాలకి తెగించి పురుటి నెప్పులు భరించి
శిశువుకి ప్రాణం పోసిన తల్లి పుట్టిన నెత్తుటికందుని చూసి తన బాధని మరచి, మురిసి ముద్దులాడుతుంది. ఆ పిల్లల ఆట, పాట,

| నవ్వు, ఏడువు, నడక, వరుగు అన్నీ తల్లికి ఆపురూపమే. అద్భుతమే, పిల్లలకి దెబ్బ తగిలితే అమ్మడి చెప్పి పెడుతుంది. ప్రతిక్షణం
పిల్లలే తన ప్రాణంగా చూసుకుని పెంచి, పెద్ద చేసిన అమ్మ గురించి ఏం రాయగలను. ఎంత చెప్పినా అది తక్కువ
మా చిన్నప్పుడు శ్రీకాకుళ ఉద్యమం జరుగుతున్న సమయంలో జైలు బ్రేక్ చేసి మా ఇంట్లో ఆశ్రయం పొందిన నలుగురు కామ్రేడ్స్
| ప్రభావం అమ్మ మీద బాగా పడింది. గరికిపాటి రాజారావు గారి దగ్గర వున్నప్పుడు అందిన కమ్యునిస్టు పార్టీ రాజకీయాలు, క్రీడాకుల
| ఉద్యమ కార్యకర్తల ప్రభావం యివన్నీ అమ్మడి విశాల ప్రపంచాన్ని చూపాయి. స్వతహాగా అమ్మది. ఎదుటి వారిని ప్రేమించే తత్వం,
| ఎదుటివాళ్ల కష్టాలకి స్పందించి సహకరించే తత్వం .. ఆ స్వభావానికి ఈ రాజకీయాలు మరింత పరిమళాన్ని అడ్డాయి.
ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా, నిస్వార్థంగా ఉద్యమంలోకి తమ పిల్లల్ని పంపిస్తూ, ఊపిరి ఉన్నంత వరకూ ఉద్యమాన్ని
విదవకండని సందేశాలు యిస్తూ, ఆదేశిస్తున్న తల్లుల చెన్నత్యాన్ని వర్ణించటం ఎవరి తరం?

కుటుంబ బాధ్యతలతో, విప్లవ కార్యకలాపాలతో సహకారాన్ని అందిస్తూ ఆమె కాకరాలతో పాటు తనవంతు బాధ్యతను శ్రద్ధగా నిర్వహించి
అందరి ప్రేమకు దగ్గరయ్యారు. ఎన్ని కష్టాలు ఎదురైనా 6 దశాబ్దాలకు పైగా విప్లవోద్యమ పురోభివృద్ధినే కాంక్షించిన విప్లవ మిత్రురాలుకు
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) వినమ్రంగా జోహార్లర్వస్తుంది.

కామ్రేడ్ కాకరాల గారికి, బందు మిత్రులకు సహానుభూతిని తెలియజేస్తుంది.
కామ్రేడ్ సూర్యకాంతం గారు కోరుకున్న నూతన సమాజం కోసం చివరి క్షణం వరకు పోరాడుదామని ప్రతిన బూనుదాం.
విప్లవాభినందనలతో,

(అభయ్)
అధికార ప్రతినిధి, కేంద్రకమిటీ,
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)