భారతీయ రైల్వే గురువారం మరో మైలురాయిని చేరింది. తొలిసారి వంద శాతం సమయపాలన సాధించి కొత్త రికార్డును నెలకొల్పింది. అన్ని రైళ్లు వంద శాతం సమయానికి గమ్యస్థానాలకు చేరుకున్నట్లు రైల్వే మంత్రి పేర్కొన్నారు. దేశంలో నడుస్తున్న అన్ని రైళ్లు సకాలంలో సురక్షితంగా ప్రయాకుణికులను తమ గమ్యస్థానాలకు చేర్చి100 శాతం సమయస్ఫూర్తి రేటును సాధించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గురువారం 230 ప్రత్యేక రైళ్లు వంద శాతం సమయపాలన పాటించి నిర్దేశించిన టైమ్‌కు గమ్యస్థానాలకు చేరినట్లు రైల్వే శాఖ తెలిపింది.
ఇది భారత రైల్వే చరిత్రలో మొట్టమొదటి సారిగా 100 శాతం సమయస్ఫూర్తిని సాధించారని అన్ని రైళ్లు సకాలంలో ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చుతున్నాయని అని రైల్వే మంత్రిత్వ శాఖ గురువారం ట్వీట్ చేసింది. రైల్వే సంస్ద సాధించిన ఈ అరుదైన రికార్డుకు సంతోషంగా వ్యక్తం చేస్తు కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఒక ట్వీట్లో ఇలా అన్నారు. భారత రైల్వే ఫాస్ట్ లేన్‌లో రైళ్లు తమ అపూర్వమైన స్థాయి సేవలను మెరుగుపరుస్తూ జూన్ 23న ఒక రైలు కాస్త ఆలస్యంగా చేరడంతో 100శాతం సాధించగా జూలై 1న 99.54శాతం సమయస్ఫూర్తిని సాధించి చరిత్ర సాధించినట్లు తెలిపారు. ప్రస్తుతం తక్కువ సంఖ్యలో రైళ్లు నడుస్తుండటంతో ఈ రికార్డు సాధ్యమైనట్లు పేర్కొంది.