పాలకు కల్తీ కాటు….?

బర్రె పాలు కాదవి…..పౌడర్ పాలు

డిమాండ్ కు తగ్గ సరఫరా లేనివి పాలు… ప్రతి ఇంట్లో ఉదయం కాగానే మొదటగా అవసరం వచ్చేవి పాలు…. ఇంతగా వాడకం ఉండే ఈ పాలు అవసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తి లేవనేది అందరికి తెలిసిన విషయమే… కానీ అందరికి మాత్రం ఇవి అత్యవసరం… పాలు నిత్యం విడిగాను, ప్యాకెట్ రూపంలోను, పౌడర్ రూపంలోనూ లభ్యం అవుతాయి.ప్యాకెట్ పాలు, పౌడర్ పాలపై అంతగా నమ్మకం లేని ప్రజలు బర్రె, ఆవు విడి పాల పైనే నమ్మకం కలిగి ఉన్నారు… దీనిని ఆసరాగా తీసుకున్న కొందరు అక్రమ వ్యాపార కేటుగాండ్లు పాల కల్తీ వ్యాపారాన్ని నిర్భయంగా కొనసాగిస్తున్నారు… పాల పొడిలో నీళ్లు కలిపి స్వచ్ఛమైన ఆవు,బర్రె పాలు అంటూ నమ్మిస్తు వాటిని విక్రయిస్తూ రోజు లక్షలు వెనకేస్తున్నారు… సంచుల కొద్ది పాలపొడి విక్రయించి పాలు తయారుచేసి త్రినగరిలో రోజు విక్రయిస్తున్నట్లు తెలిసింది. పాల పొడిలో ఇష్టమున్న నీళ్ళు కలిపి స్వచ్ఛమైన పాలు అని విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు.

పాలకు కల్తీ కాటు....?- news10.app

ఇది కల్తీ కాటు….?

అక్రమ సంపాదనకు కల్తీ సామ్రాజ్యన్ని సృష్టించుకుంటున్నారు కొంతమంది అక్రమ వ్యాపారస్తులు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతూ జేబులు నింపుకుంటున్నారు అసలే కరోనా నేపథ్యంలో భయబ్రాంతులకు గురవుతున్న ప్రజలను ఇంకా రోగాల బారిన పడేస్తున్నారు కల్తీ కేటుగాండ్లు పోషక పదార్థాలు ఉండే ఆహారం తీసుకోవాలని డాక్టర్లు చెపుతున్నప్పటికి ఇటు పోషకాలు కల్గిన పాలను సైతం కల్తీ చేసి సామాన్య ప్రజల ప్రాణాలను తీస్తున్నారు ఎక్కడి నుండో కాదు వరంగల్ నగరం నడి బొడ్డున ఈ వ్యాపార తతంగం అంతా నిర్వహిస్తున్నట్టు తెలిసింది కిలో పాల పొడి తో ఐదు లీటర్ల పాలు తయారు చేసి స్వచ్చమైన బర్రె, ఆవు పాలు అని అమ్మకాలు కొనసాగిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం…. హోటల్ లో విక్రయించే తీపి పథార్ధాలలో కలిపే పాల పొడిని పాలుగా మార్చి అమ్ముతున్నారు.

ఈ విషయం తెలియని సామాన్య ప్రజలు ,పిల్లలు ఇటువంటి పాలను సేవించి అనారోగ్య పాలు అవుతున్నట్టు తెలిసింది. మిల్క్ వెల్ అనే పాల పొడి పథార్ధాన్ని నీటిలో కలిపి పాలుగా మార్చి 60 రూపాయలకు లీటర్ చొప్పున అమ్మకం జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. నాసిరకం పాల పొడి పథార్ధo 140 రూపాయలకు కిలో చొప్పున కొనుగోలుచేసి… కిలో పాల పొడితో 5 లీటర్ల పాలు తయారు చేసి ఒక్కో లీటర్ 60 రూపాయలు చొప్పున విక్రయించి అక్రమ సంపాదనకు తెర లేపారు కల్తీ వ్యాపారులు.

గతంలో అక్రమ వ్యాపారాలు చేసి ఆ అక్రమ వ్యాపారాలలో పట్టుబడి ఆ వ్యాపారానికి దారులు ముసుకుపోవడంతో గతంలో అక్రమవ్యాపారానికి పాల్పడ్డ వారే ఈ తతంగం అంతా నడిపిస్తున్నట్టు తెలుస్తుంది …పాల కల్తీని ఎవరు గుర్తించరు ఎంత కల్తీ చేసిన పౌడర్ తో పాలు తయారుచేసి బర్రె పాలు స్వచ్ఛమైన పాలు అని చెప్పిన నమ్మి కొలుగోలుచేస్తారు కనుక ఈ వ్యాపారానికి ఎవరు అడ్డు చెప్పరని ఇలా చేస్తే ఎవరి దృష్టి పడదని ఉద్దేశం తో ఈ వ్యాపారం సజావుగా సాగిస్తున్నట్లుసమాచారం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇటువంటి కల్తీ వ్యాపారాల పై దృష్టి సారించి ఈ అక్రమాలకు పాల్పడుతున్న వారి పై దృష్టి సారించి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు… ట్రై సిటీ లో ఈ కల్తీ పాల వ్యాపారం పై పూర్తి వివరాలు సేకరించే పనిలో పడింది న్యూస్10 నిఘా టీం…