కొత్త సచివాలయం నిర్మించుకోవచ్చు

పిటిషన్లన్ని డిస్మిస్…
తెలంగాణ ప్రభుత్వం కు హైకోర్టు లో ఊరట…
నూతన సచివాలయంకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్…
సచివాలయంలో కూల్చివేతలపై ధాఖలు చేసిన పిటీషన్లను కొట్టివేసిన హైకోర్టు..

కొత్త సచివాలయం నిర్మించుకోవచ్చు- news10.app

తెలంగాణ పాత సచివాలయం కూల్చివేత కేసులో ప్రభుత్వానికి ఊరట లభించింది.సచివాలయం కూల్చివేత విషయంలో వేసిన పిటిషన్ లను విచారించిన రాష్ట్ర హైకోర్టు సోమవారం తుది తీర్పును వెల్లడించింది. పాట సచివాలయం కూల్చివేసి కొత్తది నిర్మించాలన్న క్యాబినెట్ నిర్ణయాన్ని తప్పు బట్టలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలోప్రభుత్వ వాదనలతో కోర్టు ఏకీభవించిందిహైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు తో నూతన సచివాలయ నిర్మాణానికి అడ్డంకి తొలగింది. ఇటివల సచివాలయంలో ఉన్న భవనాలను కూల్చి వేయొద్దని దాదాపు 10 పిటిషన్లు ధాఖలు కాగాఅన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. వందల కోట్ల రూపాయల ప్రజా ధనం దుర్వినియోగం అవుతుందన్న పిటిషన్ల వాదనలు వినిపించగా,ప్రభుత్వ పాలసీ విధానాలలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవద్దని ప్రభుత్వ వాదించింది అలాగే ప్రస్తుతం ఉన్న సచివాలయంలో సరైన సదుపాయాలు లేవని, ఉన్న భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని ప్రభుత్వ కోర్టుకు విన్నవించింది. దింతో ప్రభుత్వ వాదనలు సానుకూలంగా విన్న కోర్టు ప్రభుత్వ వాదన తో ఏకీభవించింది. సచివాలయంలోని భవనాల కూల్చివేతకు లైన్ క్లియర్ ఇస్తూ తీర్పు చెప్పింది కాగా సచివాలయం కూల్చివేత విషయంలో పలువురు వేసిన పిటీషన్స్ అన్నింటిని డిస్మిస్ చేస్తూ హైకోర్టు తన తీర్పుని వెల్లడించింది.