అద్వాన్నపు పనులు

జాతీయరహదారి పనుల్లో నాణ్యత లోపిస్తోంది
కానరాని పర్యవేక్షణ కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం
సిసి డ్రైనేజీ పనుల్లో నాణ్యత లోపం
క్యూరింగ్ లేక ఎండకు ఎండి పగిలిపోతున్న డ్రైనేజీ కట్టడాలు
గూడెప్పాడు నుంచి ఆత్మకూరు వరకు ఇదే దుస్థితి

వరంగల్ రూరల్ జిల్లాలో జాతీయ రహదారి పనులు అద్వాన్నంగా కొనసాగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అధికారుల పర్యవేక్షణ కానరాకపోవడంతో కాంట్రాక్టర్ల తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. జిల్లాలోని ఆత్మకూర్ జాతీయ రహదారి కి ఇరువైపుల నిర్మిస్తున్న సైడ్ డ్రైనేజీ పనులు నాసిరకం నాణ్యత లోపంతో నిర్మాణం జరుగుతున్న పట్టించుకునే దిక్కులేకుండాపోయింది.అద్వాన్నపు పనులు- news10.appఆత్మకూర్ మండలం గూడేప్పాడు నుండి ఆత్మకూరు వరకు రోడ్డుకు ఇరువైపులా సీసీ డ్రైనేజీ పనుల్లో నాణ్యతా లోపం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. జాతీయరహదారికి ఇరువైపులా చేస్తున్న నిర్మాణం ఇలా నాసిరకంగా ఉండడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇష్టా రీతిన నిర్మాణం చేయడంతో పాటు వాటర్ క్యూరింగ్ లేక మండే ఎండలకు కట్టడాలు పూర్తిగా ఎండిపోతున్నాయి. ఫలితంగా డ్రైనేజీ కట్టడం పగుళ్లతో కనపడుతుంది. వర్షం గట్టిగా కురిసి ఈ డ్రైనేజీ నుంచి నీరు బలంగా వెళ్తే నిర్మాణం కుప్పకూలి పోయేలా ఉందని స్థానిక ప్రజలు అంటున్నారు.కోట్ల రూపాయలతో జాతీయ రహదారి పనులు జరుగుతున్నఇంజనీరింగ్ అధికారులు పర్సెంటేజీ లకు కక్కుర్తిపడి పర్యవేక్షణ లేకుండానే బిల్లులు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. డ్రైనేజీ నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తే నిర్మించిన డ్రైనేజీ పగుళ్లు బారితే నీరంతా రహదారిపై ప్రవహిస్తే రహదారి అద్వాన్నంగా మారే అవకాశం ఉంది.అద్వాన్నపు పనులు- news10.app

పర్యవేక్షణ లోపం

జాతీయ రహదారికి ఇరువైపులా నిర్మిస్తున్న డ్రైనేజి లో నాణ్యత లోపిస్తుందని విమర్శలు వస్తున్న అధికారులు మాత్రం అదేం పట్టించుకోవడం లేదు. వీరి పర్యవేక్షణ పూర్తిగా లోపించడంతో కాంట్రాక్టర్లు తమకు తోచిన విదంగా నిర్మాణం చేస్తూ పని అయిపోయిందని అనిపిస్తున్నారని తెలిసింది. ఈ నిర్మాణ పనులు విషయంలో ఇకనైనా అధికారులు దృష్టి సారించకుంటే నాసిరకం పనులతోనే సరి పెట్టుకొనే పరిస్థితి వచ్చేలా ఉందని పలువురు అంటున్నారు. ఇకనైనా అధికారులు డ్రైనేజి నిర్మాణ పనులను పరిశీలించి కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.అద్వాన్నపు పనులు- news10.app