మినర(కి)ల్ వాటర్

యంపేట మండలంలో హాని కరంగా మారిన ఐ జల్ నీళ్లు
నిరుత్రాగడం వల్ల పచ్చ కామెర్ల భారిన పడుతున్న ప్రజలు
శాయంపేట ,పత్తిపాక గ్రామాల్లో నమోదవుతున్న పచ్చకామెర్ల కేసులు
వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి పరుగులు తీస్తున్న జనం
కనీస చర్యలు చేపట్టని వైద్య శాఖ అధికారులు

జలమే గరలంగా మారితే సురక్షితం అనుకున్న నీరు ప్రమాదకరంగా మారితే ఇంకే ముంది ప్రాణాపాయంగానైన మారవచ్చు లేదంటే అనారోగ్యం బారిన పడి బాధలు అనుభవించాల్సి రావచ్చు. నీరే సకల మానవాళికి ఆధారం అంటారు ఆ నీరే ప్రస్తుతం రోగాలకు కారణం అవుతుంది. దశాబ్ద కాలం క్రితం ప్రజలు బోరు, బావి నీటిపై ఆధారపడేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో జనం సురక్షితమని మినరల్ వాటర్ వైపు పరుగులు తీస్తున్నారు. ఇదే స్వచ్ఛమైన జలమని ప్రచారం అవుతుండడంతో డబ్బులు పెట్టి కొని మరి నీటిని తాగి ఒక్కమాటలో చెప్పాలంటే రోగాలను కొనితెచ్చుకుంటున్నారు. శాయంపేట మండలం లో మినరల్ వాటర్ ప్రస్తుతం ప్రజలను డేంజర్ జోన్ లోకి నెట్టి వేస్తుంది. అసలే కరోన మహమ్మారి మూలంగా జనం ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అతలాకుతలం అవుతుంటే మినరల్ వాటర్ మూలంగా వస్తున్న రోగాలతో జనం ప్రస్తుతం సతమతం అవుతున్నట్లు సమాచారం. శాయంపేట, పత్తిపాక గ్రామాల్లో ఉన్న ఈ జల్ వాటర్ ప్లాంట్ అందిస్తున్న నీరు మూలంగా జనం అనారోగ్యం బారిన పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

మినర(కి)ల్ వాటర్- news10.app చాపకింద నీరులా కామెర్లు…

శాయంపేట, పత్తిపాక గ్రామాలలో పచ్చ కామెర్ల(జాండిస్)వ్యాధి ప్రజలను కలవరపెడుతోంది. ఈ రెండు గ్రామాలే కాకుండా ఇతర గ్రామాల్లో కూడా మెల్లమెల్లగా వ్యాధి ఎక్కువవుతున్నట్లు తెలిసింది. ఒక్క పత్తిపాక గ్రామం లొనే పదుల సంఖ్యలో ఈ వ్యాధి బారిన పడి జనం ఆస్పత్రులకు పరుగులు తీశారు. ఇక శాయంపేట లో దాదాపు70 మంది కామెర్ల వ్యాధి బారిన పడగా ఇద్దరు ఈ వ్యాధి మూలంగానే మృతి చెందినట్లు గ్రామస్తులు చెపుతున్నారు. వ్యాధి తీవ్రత పెరుగకముందే వైద్య అధికారులు గ్రామాలు పర్యటించిన వ్యాధి నివారణకు కావాల్సిన చర్యలు చేపట్టక పోవడంతో వ్యాధిబారిన పడిన వారి సంఖ్య పెరిగిపోయింది.

కారణం ఏంటి…?

పత్తిపాక, శాయంపేట గ్రామాల్లో పచ్చకామెర్ల వ్యాధి విజృంభనకు కేవలం నీటి కలుషితమేనని తెలుస్తుంది. రెండు గ్రామాలకు చెందిన ప్రజలు ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న ఐజల్ మినరల్ వాటర్ ప్లాంట్ నీటిని కొనుగోలు చేసి తాగుతున్నారు. మినరల్ వాటర్ కావడంతో ఎక్కువ మంది ఈ నీటిపైనే ఆధారపడుతున్నారు. అయితే నీటి వల్లనే పచ్చకామెర్ల వ్యాధి ఎక్కువగా వస్తుంది కనుక ఈ ప్లాంట్ కు సంబందించిన నీటిని పరీక్ష నిమిత్తం ల్యాబ్ కు పంపిస్తే ఈ నీరు సురక్షితం కాదని రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చిన వెంటనే అధికారులు సంబంధిత గ్రామపంచాయితిలకు రిపోర్ట్ పంపామని అంటున్నారు. కానీ కొంతమంది రిపోర్టునే కాదని ఐ జల్ ప్లాంటులను అలాగే నడపడం వల్ల ఇంకా వ్యాధి బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇది ఇలా ఉంటే ఐ జల్ నిర్వాహకులు ఒక అడుగు ముందుకు వేసి ప్రభుత్వం సరఫరా చేస్తున్న మిషన్ భగీరథ నీరు మూలంగానే కామెర్లు వస్తున్నాయని తప్పు దారి పట్టించే ప్రయత్నం చేయగా, ఆ నీటిని సైతం టెస్టుకు పంపగా సురక్షితం సంతృప్తికరం అని రిజల్ట్ వచ్చింది. దింతో మినరల్ ప్లాంట్ నిర్వాహకులు ఉలుకు పలుకు లేకుండా గ్రామపంచాయితిల పై ఒత్తిడి తెచ్చి ప్లాంట్ లను అలాగే నిర్వహిస్తున్నట్లు తెలిసింది. దింతో వ్యాధి తీవ్రత పెరుగుతుంది.మినర(కి)ల్ వాటర్- news10.app

అధికారులు ఎక్కడ..?

రెండు గ్రామాల్లో ప్రజలు పచ్చకామెర్ల వ్యాధి బారిన పడి బాధలు పడుతుంటే వైద్య అధికారులు మాత్రం ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నెల రోజుల క్రితం పర్యటించి వెళ్లిన అధికారులు వ్యాధి తీవ్రత పెరిగిన కనీస వైద్య చికిత్స చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు దారితీస్తోంది. వైద్యం అందక కౌన్సిలింగ్ చేసేవారు లేక ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రుల వైపు వెళ్లి వేల రూపాయలు చెల్లించుకుంటున్నారు. ఇకనైనా అధికారులు ప్రజలకు మెరుగైన వైద్యం అందించి వ్యాధి కి కారణమైన మినరల్ వాటర్ ప్లాంట్ పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.