అటవీ ప్రాంతంలో హరితహారం వద్దు
మావోయిస్టు జే ఎం డబ్ల్యూ పి డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేశ్
అటవీ ప్రాంతాలలో హరితహారం అవసరం లేదని మావోయిస్టు పార్టీ జె ఎం డబ్ల్యూ పి డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హరితహారం పేరుతో వేల కోట్ల రూపాయలు పాలకులు దోచుకునే పథకం తప్ప మరోటి కాదన్నారు. దున్నే వానికే భూమి నినాదంతో జల్ జంగల్ జమీన్ ఆత్మగౌరవం అధికారం కోసం ఆదివాసీలు పేదరైతులు సమరశీల మిలిటెంట్ పోరాటాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం బడా కార్పొరేట్ సంస్థలకు అమ్ముడుపోయి ఆదివాసుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాలను తుంగలో తొక్కి 2015 నుంచి హరితహారాన్ని చేపట్టి ఆదివాసుల పంట చెలను ధ్వంసం చేస్తూ ఫారెస్టు పోలీసుల ద్వారా భూములను దౌర్జన్యంగా ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. పదుల సంఖ్యలో ఆదివాసీ గూడాలను తగలబెడుతూ అదివాసులను వారి భూముల నుంచే గెంటివేస్తున్నారని అన్నారు. ప్రాజెక్టుల పేరుతో అసలైన దోపిడిదారులు దోచుకుంటు 2 శాతం అటవీ భూములను సాగు చేసుకుంటున్న ఆదివాసులనే దురాక్రమణ దారులని సుప్రీమ్ కోర్ట్ ద్వారా తీర్పులు ఇప్పిస్తున్నారని అసలు దొంగలు పాలకులేనని మండి పడ్డారు.జీవో నెంబర్ 3 ను తిరిగి పునరుద్ధరించేవరకు ఆదివాసులు పెద్ద ఎత్తున పోరాడాలని ఆయన పిలులునిచ్చారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దళారి పెట్టుబడి దారులకు అపారమైన ఖనిజ సంపదను దోచిపెట్టడానికి, దోచుకోవడానికి వారితో ఒప్పందాలు చేసుకొని ఈ చట్టాలను అడ్డుగా పెట్టుకున్నారని అన్నారు.