మాధవ స్టోన్ క్రషర్ వ్యవహారం పై ఉలుకు లేదు.. పలుకు లేదు
ఇంకా ఎస్సారెస్పీ కాలువ పైనుంచే యథేచ్ఛగా కొనసాగుతున్న రవాణ
అధికారుల తీరుపై విమర్శలు, నిబంధనలు ఉల్లంఘిస్తున్న చర్యలెందుకు లేవని ప్రశ్న
స్టోన్ క్రషర్ యాజమాన్యంతో అధికారులు కుమ్మకైయ్యారంటూ ఆరోపణలు
వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం లాదేళ్ల లో ఉన్న మాధవ స్టోన్ క్రషర్ పై చర్యలకు నీటి పారుదల శాఖ అధికారులు వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. చాలా సంవత్సరాలుగా మాధవ స్టోన్ క్రషర్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా ఎస్సారెస్పీ కాలువ రహదారిని రవాణా కోసం ఉపయోగిస్తున్న అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మాధవ స్టోన్ క్రషర్ వ్యవహారంపై న్యూస్10 లో కథనం వెలువరించినా అధికారులు తమకేంపట్టనట్లే ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు. స్టోన్ క్రషర్ ఎస్సారెస్పీ రహదారి వాడుతున్నారని వివరణ కోరితే తాను కొత్తగా వచ్చానని చేతులు దులుపుకున్న ఎస్సారెస్పీ డిఇ ఇప్పటివరకు ఆ ప్రాంతాన్ని సందర్శించిన పాపాన పోలేదు. దింతో స్థానిక ప్రజలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
స్టోన్ క్రషర్ యాజమాన్యంతో ఎస్సారెస్పీ అధికారులు కుమ్మకైయ్యారంటూ ఆరోపిస్తున్నారు. కనీసం రహదారి కూడా లేకుండా నిభందనలకు విరుద్ధంగా ఎస్సారెస్పీ కాలువ రహదారి వాడుతున్న అధికారులు ఎందుకు నిద్ర వీడడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా అధికారులు మాధవ స్టోన్ క్రషర్ ప్రాంతాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాలువ రహదారిని ఉపయోగించకుండా చేసి కాలువను కాపాడాలని వారు కోరుతున్నారు.