అంతా..కె ఎస్ ఆర్ ఇష్టం ఎఫ్టిఎల్ నుంచి…. కదిలేది లేదు…!

చెరువు శిఖం లొనే పాఠశాల నడిపి తీరుతాం అంటున్న కె ఎస్ ఆర్.
ఎఫ్టిఎల్ కాదని నిరూపించేందుకు శతవిధాల ప్రయత్నం
ప్రజాప్రతినిధులు ,అధికారుల వద్దకు పరుగులు, పైరవీలు
కళ్లు మూసుకున్న రెవెన్యూ,విద్యా శాఖ అధికారులు
తాము ఎలాంటి అనుమతి ఇవ్వలేదని,అసలు కె ఏస్ ఆర్ యాజమాన్యం తమ వద్దకే రాలేదంటున్న ఐ బి సూపరిండెంట్

అసలు కె ఎస్ ఆర్ యాజమాన్యం వెనుక ఉన్నదెవరు….?

వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం పెద్ద చెరువు ఎఫ్టిఎల్ భూమిలో భవనాన్ని నిర్మించి పాఠశాల నడుపుతున్న కె ఎస్ ఆర్ యాజమాన్యం ఏబరు ఎన్ని చెప్పిన కథనాలు ఎన్ని రాసిన చెరువు శిఖం లొనే పాఠశాల నడిపి తీరుతామని ధీమా వ్యక్తంచేస్తున్నట్లు తెలిసింది. గత కొన్ని సంవత్సరాలుగా పాఠశాల నడువుతున్న వీరు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అధికారులందరిని తమదైన పద్దతిలో సంతృప్తి పరచడం వల్ల ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు ఏ అధికారి కూడా తీసుకోలేకపోయాడని అందుకే పాఠశాల యాజమాన్యం తమకేం అవుతుంది లే అనే భావనలో ఉందని పలువురు గ్రామస్తులు అంటున్నారు. పాఠశాల ప్రారంభం కాగానే విద్యాశాఖ, రెవెన్యూ శాఖ కు పలుమార్లు విజ్ఞప్తి చేసినా చూసి చూడనట్లు వదిలారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు అంటున్నారు. అసలు ఎఫ్టిఎల్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని స్పష్టమైన నిబంధనలు ఉన్న ఇవి అధికారులకు అర్థం కావడం లేద… లేక అర్థమై చర్యలు ఎందుకులే అని నిర్లక్ష్యం చేస్తున్నారా.. అంతుబట్టడం లేదు. ఈ విషయంలో పాఠశాల యాజమాన్యం మాత్రం తమకు అధికారులే అన్ని అనుమతులు ఇచ్చారు, ఇది ఎఫ్టిఎల్ పరిధి కాదు అని బుకాయిస్తుంది.అంతా..కె ఎస్ ఆర్ ఇష్టం ఎఫ్టిఎల్ నుంచి.... కదిలేది లేదు...!- news10.app

చూస్తే అర్థం కాదా…?

ఉరుగొండ పెద్ద చెరువును ఆనుకొని వ్యవసాయ పొలాల మధ్య ఉన్న పాఠశాల భవనాన్ని చూస్తే ఎవరికైనా చాలా సులువుగా అర్థం అవుతుంది ఇది ఎఫ్టిఎల్ భూమి అని పాఠశాల నుంచి లోపలికి కాస్త నడిస్తే చాలు నడి చెరువులోకి పోవచ్చు అయిన అది ఎఫ్టిఎల్ కాదని యాజమాన్యం అడ్డగోలు వాదన చేస్తున్నట్లు తెలిసింది.అధికారులు అందరూ పాఠశాల యాజమాన్యం వైపే ఉన్నారు కనుక ఏదైనా చెప్పవచ్చని ఎవరు ఎన్ని పిర్యాదులు చేసిన తమకేం కాదని దైర్యంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసిన అధికారుల్లో చలనం లేసు కనుకనే యాజమాన్యం ధీమా వ్యక్తంచేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అధికారులు ప్రాజాప్రతినిధుల చుట్టు ప్రదక్షిణలు

ఎఫ్టిఎల్ భూమిలో కె ఎస్ ఆర్ పాఠశాల నడుపుతున్న వ్యవహారం గూర్చి న్యూస్ 10 లో కథనం వెలువడగానే పాఠశాల యాజమాన్యం ప్రజాప్రతినిదులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు మొదలు పెట్టిందట. అన్ని అనుమతులు ఉన్నాయి,మాది అసలు ఎఫ్టిఎల్ భూమే కాదు.. అంటూ తెగ ముచ్చట్లు చెప్పిన యాజ మాన్యం అసలు ఎందుకు వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుందో అర్థం కాని విషయం. అన్ని అనుమతులు ఉన్నాయని చెపుతూనే వారి చుట్టు తిరిగుతున్నారంటేనే ఎలాంటి అనుమతులు లేవని అర్థమైపోతుంది. కావాలనే మేకపోతు గాంబిర్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు అధికారులు సైతం ఇప్పటివరకు అటువైపు కన్నెత్తి చుడకపోవడం గ్రామస్తుల ఆరోపణలకు మరింత బలం చేకూరుతుంది. ‘రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువ’అన్న చందాన అధికారం ఉంది కదా అని అధికారులు సైతం వారే అక్రమాలకు స్వయంగా ఆజ్యం పోస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అంతా..కె ఎస్ ఆర్ ఇష్టం ఎఫ్టిఎల్ నుంచి.... కదిలేది లేదు...!- news10.app

అధికారులు ఎక్కడ…?

కె ఎస్ ఆర్ పాఠశాల నడుస్తుంది చెరువు శిఖం భూమిలో …చెరువు పురుగు గా నిండితే నీళ్లు భవనాన్ని తాకుతాయి. భవనం పక్కనుంచే ప్రధాన రహదారి పైకి ప్రవహిస్తాయి.ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాలను చేరువులోనే నిర్మించి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న జిల్లా విద్యాశాఖ అధికారులకు మాత్రం ఏం కనపడలేదట.పాఠశాల కు మాత్రం అనుమతులు ఇచ్చేసారు. విషపురుగులు,కీటకాలు,పాములు, తేళ్లు తిరిగే ఈ ఎఫ్టిఎల్ పరిధిలో పాఠశాల నడపడం ఎంటవరకు క్షేమమో విద్యాశాఖ అధికారులే చెప్పాలి. మొన్నటి వరకు కనీసం కాలి బాట కూడా లేని చోట,వర్షం వస్తే మోకాలి లోతు నీరు నిలిచే చోట పాఠశాల ఎలా నడుస్తుందో అధికారులు ఎలా కళ్ళుమూసుకుని అనుమతి ఇచ్చారో ఏమాత్రం తెలియడం లేదు. దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పిల్లలకు ప్రమాదకరంగా చెరువు శిఖంలో నడుపుతున్న కె ఎస్ ఆర్ పాఠశాల అనుమతి రద్దు చేసి పాఠశాలని మూసివేసి చెరువు శిఖాన్ని కాపాడాలని వారు కోరుతున్నారు.

అనుమతులు ఇవ్వలేదు

ఉరుగొండ పెద్ద చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో నసుస్తున్న పాఠశాల భవన నిర్మాణానికి తాము ఎలాంటి అనుమతి ఇవ్వలేదని నీటి పారుదల శాఖ డిఇ న్యూస్10 కు స్పష్టం చేశారు.అసలు పాఠశాల యాజమాన్యం తమను ఎప్పుడు సంప్రదించలేదన్నారు. కనీసం ధరఖాస్తు కూడా చేసుకోలేదని ఆయన తెలిపారు.అంతా..కె ఎస్ ఆర్ ఇష్టం ఎఫ్టిఎల్ నుంచి.... కదిలేది లేదు...!- news10.app

యాజమాన్యం వెనుక ఉన్నదెవరు…?

కె ఎస్ ఆర్ యాజమాన్యం వెనుక కొంతమంది రాజకీయ నాయకులు ఉండి ఈ తతంగమంత నడిపిస్తున్నట్లు తెలిసింది. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు తమ అండదండలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు చెరువులను రక్షించుకుందాం రైతన్నలకు అండగా ఉందామని గులాబీ బాస్ చెపుతుంటే ఇక్కడి నాయకులు మాత్రం చెరువు కబ్జాలకు సహకరిస్తున్నారని విమర్శలు వచ్చిపడుతున్నాయి. వీరి సహకారం వల్లే యాజమాన్యం ఎఫ్టిఎల్ అని తెలిసిన పాఠశాల నడుపుతు ఆధికారులకే సవాలు విసురుతోందని యాజమాన్యం తీరుపై పలువురు చర్చించుకుంటుంనారు. ఇకననా పాఠశాల విశాయిజంలో అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.