నర్సంపేట లో మద్యం సిండి’కే టు’లు

అధిక ధరలతో మద్యం వ్యాపారుల ఇష్టారాజ్యం
పది రూపాయల ఎక్కువ ధరతో బెల్ట్ షాపులకు విక్రయం
సిండికేట్ ఐయారు… మద్యం ప్రియుల జేబుగుల్ల చేస్తున్నారు
చర్యలకు వెనుకాడుతున్న ఎక్సైజ్ అధికారులు
మామూళ్ళతో మద్యం వ్యాపారులకు వంత పాడుతున్నారని ప్రజల ఆరోపణ.

నర్సంపేట లో మద్యం వ్యాపారులు తమ అధిక ధరలహవా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు పక్కనబెట్టి ,సిండికేట్‌గా మారి ప్రశ్నించే వారే లేరనే ధైర్యంతో దర్జాగా అధిక ధరల దందా చేస్తున్నారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు బెల్టు షాపులకు విక్రయిస్తూ మందుబాబుల జేబులు గుల్లచేస్తున్నారు. చేసేది లేక, ఎవరికీ చెప్పుకోవాలో తెలియక వారు నిర్ణయించిన ధరలు చెల్లించి మద్యం కొనుగోలు చేస్తున్నారు మద్యం ప్రియులు. చట్ట ప్రకారం ఎమ్మార్పీ ధరలకు విక్రయించాల్సిన మద్యం బాటి ల్‌పై రూ.10 అదనంగా తీసుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. అసలు ప్రభుత్వం బెల్టు షాపులు లేకుండా ఉండాలని చూస్తున్న నేపథ్యంలో నర్సంపేట లోని ఎక్సైజ్ అధికారులే ఈ యొక్క మద్యం దందాకు ఆద్యం పోస్తూ ఉన్నారని విశ్వసనీయ సమాచారం.నర్సంపేట లో మద్యం సిండి'కే టు'లు- news10.app

నర్సంపేట లో ఒక విధంగా, మిగిలిన ప్రాంతాల్లో ఒక రకంగా ధరలు ఉంటున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ లేని విదంగా మద్యం వ్యాపారుల దందా ఇక్కడ కొనసాగుతుంది. అధిక ధరల విక్రయ దోపిడీని అధికారికం గా అడ్డుకునే వారే లేరనే ధీమాతో పాటు ఎక్సై జ్ అధికారులే తమకు అండగా ఉన్నారనే విధంగా వ్యాపారం చేస్తున్నట్లు వీరిపై విమర్శలు వినవస్తున్నాయి. వీరు ప్రభుత్వ నిబంధనలకు పాతరేసి ఎక్సైజ్ అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకొని తాము ఆడిందే ఆట.. పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారని సర్వత్ర ఆరోపణలు ఉన్నాయి. అధికారుల అలసత్వం మూలంగా మద్యం ధరలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని మందుబాబులు వాపోతున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు, ఎక్సైజ్ శాఖ అధికా రులకు పలుమార్లు అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఫిర్యాదులు చేసినా ఎక్సైజ్ శాఖ అధికారులు అటు వైపు కన్నేత్తి చూడకపోవడం వెనుక పలు విమర్శలు వెలువెత్తు తున్నాయి. ఇంతే కాకుండా మందుబాబుల జేబులకు చిల్లు లు పెట్టడమేపెట్టుకున్న వీరు ఒళ్ళు కూడా గుల్ల చేస్తున్నరని తెలుస్తోంది.

మద్యం సీసాల్లో కల్తీ సరుకు నింపి విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి కైనా అబ్కారీ అధికారులు కల్తీని అరికడుతూ మద్యం బాబుల జేబులకు చిల్లులు పడకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు నర్సంపేట పట్టణంలో ఉన్న వైన్‌షాపుల్లో ‘అదనపు’ ఆదాయం ద్వారా దుకాణ యజమానులు రూ. కోట్లలో ఆదాయం సమకూర్చుకుంటూ ఎక్సైజ్ అధికారు ల జేబులను కూడా నింపుతున్నట్లు సమాచారం. ముడుపులు అందుతున్నాయి కనుకనే అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది.