అంటుకుందా….అగ్గిపెట్టార?

  • కల్యాణలక్ష్మి షాపింగ్ మాల్ ఘటనపై అనేక అనుమానాలు
  • నివేదిక తయారీలో తలమునకలైన అధికారులు
  • ప్రమాదానికి ముందే సరుకును తరలించారు…..?
  • నాలుగు నెలలుగా సిబ్బంది వేతనం, కరెంట్ బిల్లు, బ్యాంక్ లోన్ ఎందుకు చెల్లించలేదు..?
  • మూడో అంతస్తులో ప్రమాదం జరిగితే తీవ్రత తగ్గాక గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న సరుకును ఎందుకు తరలించలేదు…?
  • లాక్ డౌన్ సమయంలో అసలు షట్టర్ ఎందుకు తెరావాల్సి వచ్చింది…?
  • షాపింగ్ మాల్ లో ఉన్న సరుకు ఎంత…వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులు ఎన్ని…?
  • నష్టాల్లో ఉన్నవారికి ఇది అలవాటుగా మారిందా…?

కొద్దీ రోజులక్రితం అగ్నిప్రమాదం జరిగిన కల్యాణలక్ష్మి షాపింగ్ మాల్ విషయంలో అనేక అనుమానాలు ముసురుకున్నాయి. గతంలో ఇలాగే పెద్ద పెద్ద బట్టల దుకాణనాలలో అగ్నిప్రమాదాలు జరిగాయి. తరుచుగా కార్పొరేట్ స్థాయిలో ఉన్న షాపింగ్ మాల్స్ లల్లో అగ్నిప్రమాదాలు జరగడం వివిధ అనుమానాలకు దారి తీస్తోంది. సరిగ్గా అలాగే కళ్యాణ లక్ష్మి విషయంలో సైతం అనేక అనుమానాలు, సమాధానం లేని ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో కళ్యాణ లక్ష్మి షాపింగ్ మాల్ యాజమాన్యం చాలా పక్డ్బందిగా, ఎవరికి అనుమానం కలగకుండా పని కానిచ్చేసిందనే ఆరోపణలు గుప్పు మంటున్నాయి. ఆంటుకుందా లేదా అగ్గిపెట్టారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో పాటు యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు దారి తీస్తోంది. సంఘటన జరిగిన రోజు అగ్ని మాపక అధికారి షాపింగ్ మాల్ లోని మొదటి అంతస్తు,గ్రౌండ్ ఫ్లోర్ లో ఎలాంటి ప్రమాదం లేదు మీ మనుషులతో స్టాక్ తీయమని యజమాని కి చెపితే నిక్షేపంగా ఉన్న స్టాక్ ను బయటకు తీయడానికి ససేమిరా అన్నాడట. దీంట్లో మర్మం ఏం ఉందో తెలియదు కానీ కేవలం బీమా కోసమే ఇలా ప్రవర్తించారని పాక్షిక అగ్ని ప్రమాదం అని ప్రచారం అయితే ఇన్స్యూరెన్స్ తక్కువగా క్లెం అవుతుంది కనుక స్టాక్ తీయడానికి ససేమిరా అన్నారు తెలుస్తోంది.

అంటుకుందా....అగ్గిపెట్టార?- news10.app

ప్రమాదానికి ముందే సరుకు తరలిందా…?

అగ్ని ప్రమాద ఘటనలో మరో అనుమానం బలంగా వినపడుతోంది. ప్రమాదానికి ముందే మూడు రోజులు వరుసగా షాపింగ్ మాల్ యాజమాన్యం విలువైన సరుకును అర్థరాత్రి పూట గుట్టు చప్పుడు కాకుండా తరలించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని చుట్టూ పక్కల వాళ్ళు గమనించిన ఇంతటి పథకం రచించారని వారికి తెలియదు. ఈ విషయం వారికి తెలిసిన పెద్ద వ్యాపారస్తుల కథ మాకెందుకు అని గమ్మున ఉరుకున్నట్లు తెలిసింది. అయితే ప్రమాదానికి పదిరోజుల ముందే బిల్లు చెల్లించక కరెంట్ కట్ కాగా మాల్ లోని సీసి కెమెరాలు పనిచేయకుండా పోయాయి ఈ పనిచేయడం కోసమే సిసిలు పనిచేయకుండా బిల్లు చెల్లించకుండా ఆపారా..? కరోనా నేపధ్యంలో విద్యుత్ శాఖ కూడా బిల్లుల వసూలు, చెల్లించని వారి విద్యుత్ కట్ విషయంలో అంతగా ప్రాధాన్య త చూపలేదు మరి ఈ మాల్ విద్యుత్ కనెక్షన్ ఎలా కట్ అయ్యిందనే ది ప్రశ్న. ఈ విషయంలో నిజానిజాలు తెలియాలి అంటే చుట్టూ పక్కల కెమరా లు పరిశీలిస్తే సరిపోతుంది మరి అధికారులు ఆ దిశగా ప్రయత్నం చేస్తారా..? చూడాలి

నాలుగు నెలలుగా వేతనాలు లేవా..?

షాపింగ్ మాల్ లో పనిచేస్తున్న సిబ్బందికి నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించ డం లేదని తెలిసింది. వ్యాపారం నష్టాల్లో ఉందని ఎంతో కొంత సర్దుబాటు చేస్తూ నాలుగు నెలలుగా సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా ఉన్నారని ఈ లోపు లాక్ డౌన్ రావడంతో వేతనా ల ఊసే మరిచారనే సమాచారం. వేతనాలతో పాటు విద్యుత్ బిల్లు, బ్యాంక్ లోన్ అమౌంట్ కట్టడం లేదని విశ్వసనీయంగా తెలిసింది. వీటన్నింటి నుండి బయట పడడం కోసం అగ్నిప్రమాదం ఎపిసోడ్ కొనసాగింది అని దీనికి ప్రముఖుల పరిచయాలు పనికొచ్చాయని కథలు, కథలుగా ప్రచారం అవుతుంది.

లాక్ డౌన్ సమయంలో షట్టర్ ఎందుకు తెరిసారు…?

కరోనా మూలంగా లాక్ డౌన్ ప్రారంభం కాగానే దాదాపు ఆన్ని దుకాణాలు మూసే ఉన్నాయి. ఏ యాజమాన్యం దుకాణాల వైపు కూడా చూడలేదు. కళ్యాణ లక్ష్మి మాల్ యాజమాన్యం మాత్రం షట్టర్ ఓపెన్ చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని చెపుతున్న యాజమాన్యం పదిరోజుల క్రితమే విద్యుత్ కట్ అయ్యిందనే విషయం వారికి తెలియదా అర్దం కాలేదు. జనరేటర్ ద్వారా కరెంట్ వచ్చింది అనుకుంటే ఎందుకు జనరేటర్ ఆన్ చేయాల్సి వచ్చింది..? నిజానికి అంత పెద్ద షాపింగ్ మాల్ శెట్టర్ తెరుసుకోవాలంటే కరెంట్ ద్వారా మిషన్ ద్వారా పైకి లేపుతారు. ప్రమాదం జరిగినప్పుడు శెట్టర్ మనిషి దూరెంత మూడు నాలుగు పీట్ల మేరకు మాత్రమే పైకి ఉంది. ఈ మాత్రం ఎత్తులో శెట్టర్ ను మ్యాన్వల్ గా కూడా ఎత్తొచ్చు అలాజరిగితే జనరేటర్ తో కూడా పనిలేదు, శెట్టర్ ఎత్తిన దానిని చూస్తే అది మ్యానువల్ గానే పైకి లేచినట్లు ఉంది మరి షార్ట్ సర్క్యూట్ కు అవకాశం ఎక్కడిదని అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

అధికారుల నివేదికలు ఏం చెప్తాయి..?

కల్యాణలక్ష్మి షాపింగ్ మాల్ విషయంలో అధికారులు నివేదికలు తయారు చేయడంలో బిజీగా ఉన్నారు. పోలీస్, రెవెన్యూ, ఫైర్, కార్పొరేషన్ అధికారులు ఈ పనిలోనే తలమునకలు అయినట్లు సమాచారం. ఇన్ని లొసుగులు, అనుమానాలు ఉన్న అగ్ని ప్రమాదం విషయంలో వీరు ఏ నివేదిక సమర్పిస్తారు అనే ఆసక్తి నెలకొంది. ఇతర దుకాణాలు నుంచి, షాపింగ్ మాల్ సమీపంలో ఉన్న సిసి ఫుటేజ్ ను పరిశీలించి నిర్ణయానికి వస్తారా.. లేదా తూ తూ మంత్రంగా నే నివేదిక ముగిస్తారా…? చూడాలి. వ్యాపారాల్లో నష్టాలు చవిచూసిన,ఇన్స్యూరెన్స్ నుంచి లబ్ది పొందాలన్న కార్పొరేట్ వ్యాపారస్థులు అగ్ని ప్రమాద నాటకాన్ని రక్తి కట్టిస్తారని అందరికీ తెలుసు. గతంలో నగరంలో ఓ వస్త్రవ్యాపారి ఇలాగే రక్తి కట్టించి ఇన్సూరెన్స్ లో కోట్లు కొల్ల గొట్టాడనే ప్రచారం ఉంది. రెండు సార్లు ఈ నాటకానికి తెర లేపి లబ్ది పొందాడని అప్పట్లో ఆరోపణలు గుప్పుమన్నాయి. సరిగ్గా అలాగే కల్యాణలక్ష్మి మాల్ వ్యవహారం ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది.

బిల్డింగ్ ప్లాన్ చూసే అనుమతి ఇచ్చార..?

కల్యాణలక్ష్మి షాపింగ్ మాల్ అనుమతి సైతం అనేక మలుపులు తిరుగుతోంది.ఫైర్ అనుమతి లేదని అగ్ని మాపక శాఖ అధికారులు చెప్తుంటే,అసలు షాపింగ్ మాల్ బిల్డింగ్ ప్లా న్ కు ప్రస్తుతం ఉన్న మాల్ కు అసలు పొంతనే లేదు. ప్లాన్ మాత్రం నిబంధనలకు అనుగుణంగా ఉన్న మాల్ నిర్మాణం ఆలా లేదు. ప్లాన్ లో దారులు, కాలిస్థలం,వెనుకవైపు రహదారి అంటూ ఉన్న అక్కడ అలాంటిది లేదు. అధికారులు మాత్రం అనుమతి ఇచ్చారు. ప్లానింగ్ ఒకటి నిర్మాణం మరోటి ఉన్న జీ డబ్ల్యూ ఏం సి అధికారులు గుడ్డిగా అనుమతి ఇచ్చారు.

మొత్తానికి కల్యాణలక్ష్మి షాపింగ్ మాల్ అగ్నిప్రమాద వ్యవహారం అనేక అనుమానాలకు తెరలేపింది. దీని విషయంలో అధికారులు ఏం చేస్తారో వేచి చూడాలి.