20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజి: ప్రధాని నరేంద్ర మోదీ
కరోన నెపద్యంలో నష్టపోయిన వారిని ఆదుకోవడానికి 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. మంగళవారం జాతిని ఉద్దేశించి మాట్లాడిన ఆయన చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆసుకోవడానికి ఆర్థిక ప్యాకేజి ఉపయోగ పడుతుందన్నారు ఈ ప్యాకేజి దేశ జీడీపి లో 10 శాతం ఉంటుందన్నారు. ఆర్థిక ప్యాకేజీలో అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యత కల్పిస్తామని కార్మికులకు, కర్షకులకు, స్థానం కల్పిస్తామన్నారు. ఆత్మ నిర్బర్ భారత్ అభియాన్ పేరుతొ ఈ ప్యాకేజి కొనసాగుతుందన్నారు. ప్రతి ఒక్కరు స్థానిక వస్తువులకు ప్రచారం కల్పించాలన్నారు ఆపద కాలం లో ఆదుకున్నవి స్థానిక ఉత్పత్తి ఏ నన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ప్యాకేజి ఉంటుందన్నారు. నాలుగో లాక్ డౌన్ కొత్తగా ఉంటుందని ఈ లాక్ డౌన్ వివరాలను 18 కంటే ముందే వెల్లడిస్తామన్నారు. వ్యవసాయం పై ఎలాంటి ప్రభావం పడకుండా సంస్కరణలు ఉంటాయన్నారు.