సీఎం కేసీఆర్ పై డీకే అరుణ‌ ఫైర్

ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ మాట్లాడిన మాటలు అయన స్థాయిని దిగజార్చాయి కేసీఆర్ చెప్పిన మాట‌ల‌న్నీ అబ‌ద్దాలే… గంట సేపు సెల్ఫ్ డ‌బ్బా కొట్టుకున్న‌డు తెలంగాణ ప్రజల పక్షాన ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక ఈ చౌకబారు అవహేళన మాటలు మాట్లాడుతున్నాడు రైతు సమస్యలు మాట్లాడితే ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కులను చిల్లగాళ్లు, జోకర్లు,బఫూన్లు, స‌న్నాసులు అన‌డం సిగ్గు చేటు.

సీఎం కేసీఆర్ పై డీకే అరుణ‌ ఫైర్- news10.app

ముఖ్య మంత్రి భాష తీరు ఇదేనా

రైతుల స‌మ‌స్య‌ల‌పై ఉన్న వాస్థ‌వాలు మాట్లాడితే కేసీఆర్ కు కోపం వ‌చ్చింది ధాన్యం కొనుగోలు సెంటర్ లలో రైతులు పడుతున్న ఇబ్బందులు ఒకసారి మీరు వెళ్లి చూడండి. గోనె సంచులు లేవు, లారీల ట్రాన్స్ పోర్టు సరిగ్గ లేదు , లోడింగ్ అన్ లోడింగ్ సమస్యలతో కాంటా ఎయ్యక ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు పడిగాపులు కాస్తున్నారు. వానకు భయపడి ఆందోళన పడుతుంటే , ముఖ్య‌మంత్రి రైతులను చిల్లరగాళ్లని అవమానిస్తారా? ప్రగతి భవన్ లో మీరు ఉన్నట్టు రైతులందరూ సుఖంగా లేరు.. ప్ర‌జ‌ల ఆరోగ్యం కంటే రాష్ట్ర ఖ‌జానే కేసీఆర్ కు ముఖ్య‌మా రాష్ట్రంలో ఫించ‌న్ , రైతు బందు, జీతాలు ఇవ్వాలంటే లీక్క‌ర్ ఆధాయమే మార్గ‌మా తాగండి, సావండి, ఖజానా నింపండి, అన్నట్లుగా ఉంది కేసీఆర్ వైఖరి..

కేసీఆర్ కు చేత గాక కేంద్రం పై విమ‌ర్శ‌లు చేయ‌డం స‌రికాదు

వ‌ల‌స కార్మికుల‌ను త‌ర‌లించేందుకు చార్జీలకు 85 % నిధులు కేంద్రం రైల్వే శాఖ ఇస్తున్నది, తెలంగాణ ప్రభుత్వం 15% మాత్రమే ఇస్తున్నది. మన రాష్ట్ర కార్మికుల కోసం 15% చార్జీ పెట్టడానికి నువ్వు అడ్డగోలుగ మాట్లాడతావా? ఇదేనా నీ సంసృతి? రాష్ట్రం లోఉన్న వలస కార్మికుల కోసం మోడీ ప్రభుత్వం ఇచ్చిన రూ. 599 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఏమి చేసిందని ప్రశ్నించారు. కరోనా నేపథ్యంలో మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఇప్పటి వరకు 7082 కోట్ల రూపాయలు విడుదల చేసింది. కేంద్రం సాహ‌కారం తోనే కేసీఆర్ ప్ర‌భుత్వం ప‌థ‌కాలు అమ‌లు చేస్తోంది కేంద్రం ఇచ్చిన నిధుల‌పై ప్ర‌భుత్వం శ్వేత ప‌త్రాం విడుద‌ల చేయాలి కేసీఆర్ అహంకారమే ఆయన పతనానికి దారితీస్తుంది.

రాష్ట్రంలో ఉన్న కార్మికుల‌కు ప్ర‌భుత్వం భ‌రోసా క‌ల్పించాలి హైద‌రాబాద్ లోను క‌రోనా కేసులు లేని ప్రాంతాల‌ల్లో కార్మికుల‌కు స‌డ‌లింపులు ఇవ్వాలి రైతుల ధాన్యాన్నిపూర్తిగా ప్ర‌భుత్వం వెంట‌నే కొనుగోలు చేయాలి తోట‌లోనే ఉండిపోయిన బత్తాయి, మామిడి పండ్ల‌ను వెంట‌నే కొనుగోలు చేసేందుకు అధికారుల‌కు ఆదేశాలు ఇవ్వాండి రైతుల ఆందోళ‌న చెందుతున్నారు ప్ర‌భుత్వం వారికి భ‌రోస క‌ల్పించండి ప్రతిపక్షంగ మేము చెప్పే వాస్థ‌వాల‌ను..కేసీఆర్‌ సలహాలుగా తీసుకోండి …సద్విమర్శగా స్వీకరించాలన్నారు.