లాక్ డౌన్ నేపద్యంలో జిల్లాలో అత్యవసరం కానీ పనుల కోసం ప్రజలు బయటికి రావద్దని, ముఖ్యంగా వృద్దులు, చిన్న పిల్లలు, గర్భిణీలు ఎమర్జెన్సీ అయితే తప్ప రోడ్డు ఎక్కద్దని అన్నారు. నిత్యావసరాల కోసం వచ్చే ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని శనివారం అదనపు ఎస్పీ శ్రీ వి. శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు.లాక్ డౌన్ మినహాయింపులో భాగంగా సరైన అనుమతులు ఉండి, తమ సొంత రాష్ట్రాలకు వెళుతున్న వలస కూలీలకు మన జిల్లా పరిధి దాటే వరకు పోలీసు అధికారులు, సిబ్బంది సహాయం చేయాలని పేర్కొన్నారు. చిన్నపిల్లలు ఉంటే వారికి ఫ్రూట్స్, బిస్కెట్, స్నాక్స్ లాంటివి అందజేయాలన్నారు. లాక్ డౌన్ సందర్భంగా పక్క రాష్ట్రాల అనుమతి లేకపోవడం వలన ఇంతవరకు కఠినంగా వ్యవహరిస్తూ వలస కూలీలను ఎక్కడ వాళ్ళ ని అక్కడే ఆపడం జరిగింది. వారికి ఉండటానికి వసతి, భోజన సౌకర్యం మరియు వారి హెల్త్ చెకప్ కూడా చేయించడం జరిగిందన్నారు. కరోనా సంబంధించిన ఇబ్బందులు గాని అనుమానాలు గాని, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో dial 100 కాల్ చేసి సమస్య తెలపాలని అన్నారు.
జిల్లా పరిధిలో ఇప్పటికే కొంతమంది పోలీసు అధికారులు తమ సొంత ఖర్చులతో పేదవారికి అనాధలకు వలస కూలీలకు సహాయ సహకారాలు అందించారని, ఇదే స్ఫూర్తిని లాక్ డౌన్ ముగిసే వరకు కొనసాగిoచాలని అదనపు ఎస్పీ వెల్లడించారు.