రైతు గర్వపడేలా సేవలు అందిస్తాం

జయశంకర్ భపాల్ పల్లి మహాదేవపూర్ మండల కేంద్రంలో ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మెన్ చల్ల తిరుపతయ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జయశంకర్ భూపాలపల్లి జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణీ, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు ఇరువురు కలిసి ప్రారంభించారు. రైతన్న లేని రాజ్యం లేదని,కే సీ ఆర్ కలలు కన్న రైతు రాజ్యం కోసం ప్రతి ఒక్కరం శ్రమించాలని, రైతు శ్రమకు తగిన ప్రతిఫలం ఇవ్వడానికే.. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు అని, రైతు కు కష్టాలు లేకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటామని జడ్పీ చైర్ ఫర్సన్ జక్కు శ్రీహర్షిణీ అన్నారు.

రైతు గర్వపడేలా సేవలు అందిస్తాం- news10.app

కే సీ ఆర్ పాలన అంటేనే రైతు రాజ్యమని.. రైతు రాజ్యంలో ప్రతి రైతు గర్వపడేలా సేవలు అందిస్తామని… ప్రతి గింజ కు కనీస మద్దతు ధర అందేలా.. చూస్తామని, ఏ రైతు దోపిడీకి గురికావద్దని, రైతుకు న్యాయం జరిగేలా దగ్గరుండి చూస్తామని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. పుట్ట లింగమ్మ ట్రస్ట్ ఆద్వర్యంలోమాస్క్ లను హమాలీ కార్మికులకు అందజేశారు. అనంతరం పి ఏ సీ ఎస్ కార్యాలయంలో ఛైర్మెన్ చల్ల తిరుపతయ్య సహకారంతో.. 100 మంది నిరుపేదలకు 10కేజీ ల బియ్యం, 9రకాల నిత్యావసరాలు పంపిణీ చేయడం జరిగింది. కష్టకాలంలో నిరుపేదల ఆకలి తీర్చడం.. మనందరి బాధ్యత అని పాలకులు సమాజ సేవలో అగ్రగణ్యులు కావాలని, ప్రజల ఇబ్బందులు తీర్చడానికి చల్ల తిరుపతయ్య కృషిని ఇద్దరు చైర్మన్లు అభినందించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీపతిబాపు, ఎంపీపీ బి రాణి బాయి,జడ్పీటీసీ గుడాల అరుణ,మార్కెట్ కమిటీ చైర్ ఫర్సన్ ఆన్కరి భవాని,కాటారం పిఏసిఎస్ ఛైర్మెన్ చల్ల నారాయణ రెడ్డి,వైస్ చైర్మన్ పెండ్యాల అనీల్, డైరెక్టర్లు తోట సుధాకర్, ఇబ్రహీం,సమ్మయ్య,ఉప సర్పంచ్ సల్మాన్, పార్టీ టౌన్ ప్రెసిడెంట్ కూరతోట రాకేశ్, యూత్ మండల అధ్యక్షులు అలీం, పార్టీ మండల మహిళా అధ్యక్షులు అన్నమనేని అరుణ, నాయకులు కేదారి గీత, టీ ఆర్ ఎస్ పార్టీ పలిమెల మండల అధ్యక్షులు జవ్వాజి తిరుపతి,చల్ల ఓదెలు, రామారావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here