హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం హౌజ్ బుజుర్గ్ గ్రామంలో వ్రిద్ది కంపెనీ డాంబర్ ప్లాంట్ ఏర్పాటు చేసి కాలుష్యానికి కారకంగా మారడంపై ఆ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు….కలెక్టర్ మేడం మాకెందుకీ బాధ అంటూ ఆ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు… గత పది రోజుల క్రితం డాంబర్ ప్లాంట్ విషయంలో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కార్యాలయంలో పిర్యాదు చేసిన అధికారులు కనీసం స్పందించక పోవడం పట్ల వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు… సాయంత్రం ఐయిందంటే చాలు డాంబర్ ప్లాంట్ నుంచి వెలువడుతున్న విష వాయువులతో కూడిన పొగతో గ్రామం మొత్తం కమ్ముకుంటున్న ఆధికారులు తమకేం పట్టనట్లు వ్యవహరించడం ఎందుకో వారికే తెలియాలి…జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ డాంబర్ ప్లాంట్ కనీసం రెండు వందల మీటర్ల దూరంలో ఉండాలని నిబంధన ఉన్న జాతీయ రహదారిని అనుకోని కనీసం యాభై మీటర్ల దూరం కూడలేని వృద్ధి కంపెనీ డాంబర్ ప్లాంట్ కు ఎలా అనుమతులు ఇచ్చారో దీని వెనకాల మతలబు ఏంటో వారికే తెలియాలి….కాగా ఇక్కడ వ్రిద్ది కంపెనీ ఏర్పాటు చేసిన డాంబర్ ప్లాంట్ వల్ల గ్రామస్తులు సతమతం అవుతున్నారు….డాంబర్ ప్లాంట్ నుంచి వెలువడుతున్న పొగ వల్ల గ్రామస్తులకు శ్వాసకోశ వ్యాధులు వచ్చే ముప్పు ఉందని ఆందోళన చెందుతున్నారు….అంతేకాదు వృద్ధి కంపెనీ ఏర్పాటు చేసిన డాంబర్ ప్లాంట్ కు వెనుకవైపు నుంచి ప్రభుత్వ పాఠశాల అతి సమీపంలో ఉంది…పగటి వేళల్లో డాంబర్ ప్లాంటు నడిపితే ఈ పొగ నేరుగా పాఠశాలను కమ్మే ప్రమాదం ఉందని గ్రామస్తులు అంటున్నారు….
కలెక్టర్ మేడం కాస్త పట్టించుకోండి…
డాంబర్ ప్లాంట్ వల్ల బాధలు పడుతున్న తమ గ్రామస్తుల సమస్యను హన్మకొండ జిల్లా కలెక్టర్ కాస్త పట్టించుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు…ఎలాంటి అనుమతులతో అక్కడ వృద్ధి కంపెనీ డాంబర్ ప్లాంట్ ఏర్పాటు చేసిందో… సరైన అనుమతులు లేకుంటే ప్లాంట్ ను మూసివేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు…మరి ఈ డాంబర్ ప్లాంట్ విషయంలో కలెక్టర్ ఎలా స్పందిస్తారో చూడాలి….