ములుగు గులాబీలో ముసలం మొదలైనట్లుగా కనపడుతుంది… ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత ఆప్తుడు దివంగత నాయకుడు మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ తనయుడు డాక్టర్ అజ్మీరా ప్రహ్లాద్ గులాబీ పార్టీని వీడనున్నట్లు తెలుస్తుంది….తన తండ్రి బి ఆర్ ఎస్ లో మంత్రిగా కొనసాగినపుడు ములుగు మార్కెట్ కమిటీ ఛైర్మెన్ గా,ములుగు నియోజకవర్గం ఇంచార్జి గా కొనసాగిన ప్రహ్లాద్ కొద్దిరోజులక్రితం ప్రకటించిన టికెట్ జాబితా లో తనపేరు లేకపోవడం తాడ్వాయి జెడ్పీటీసీ బడే నాగజ్యోతి కి ఈ టికెట్ రావడంతో ప్రహ్లాద్ నొచ్చుకున్నట్లు సమాచారం…ఇక తనకు ములుగు నియోజకవర్గం నుంచి ప్రాధాన్యత దక్కదు అని భావించిన ప్రహ్లాద్ గులాబీ కి గుడ్ బై చెప్పేందుకు సిద్ధం ఐయినట్లు సమాచారం…మొన్నటివరకు ములుగు నియోజకవర్గం టికెట్ తనకే దక్కుతుంది తనకు ఎవరు పోటీ లేరని భావించిన ఆయన అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో నారాజ్ ఐయినట్లు తెలిసింది….
కమలం గూటికి…..?
గులాబీ లో తనకు ఎలాగూ టికెట్ దక్కదని తేలిపోవడంతో డాక్టర్ అజ్మీరా ప్రహ్లాద్ కమలం గూటిలో చేరేందుకు సిద్ధం ఐయినట్లు సమాచారం….కమలం పార్టీలో చేరి ములుగు నియోజకవర్గం నుంచి బరిలో నిలువనున్నట్లు తెలిసింది… ప్రస్తుతం ములుగు నియోజకవర్గం నుంచి కోయ సామాజికవర్గానికి చెందిన ఇద్దరు మహిళలు బి ఆర్ ఎస్,కాంగ్రెస్ నుంచి బరిలో నిలుస్తుండగా తాను బీజేపీ లో చేరి బరిలో ఉంటే నియోజకవర్గం తన తండ్రి పరపతి, లంబాడ సామాజికవర్గానికి చెందిన ఓటు బ్యాంక్ తో తాను ఎన్నికల్లో గట్టెక్కవచ్చని ప్రహ్లాద్ భాభిస్తున్నట్లు తెలియవచ్చింది….కాగా ములుగు నియోజకవర్గం నుంచి తనకు బి ఆర్ ఎస్ టికెట్ దక్కకపోవడంతో మొన్నటివరకు అవసరం ఐయితే బి ఆర్ ఎస్ రెబల్ అబ్యర్థిగా లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవాలని అనుకున్న ప్రహ్లద్ ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకొని ఏదైనా పార్టీ లో చేరితేనే బాగుంటుందని భావించి బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది….ఇప్పటికే బీజేపీ పెద్దలతో మాట్లాడి తన చేరికకు మార్గం సుగమం చేసుకున్న ప్రహ్లాద్ త్వరలోనే కాషాయ తీర్టం పుచ్చుకొనున్నట్లు విశ్వసనీయ సమాచారం…..ములుగు నుంచి డాక్టర్ ప్రహ్లాద్ బరిలో దిగితే ఇక్కడ త్రిముఖ పోటీ ఖాయంగ కనపడుతుంది…. ములుగు నియోజకవర్గం వ్యాప్తంగా అజ్మీరా చందూలాల్ అభిమానులు,అనుచరులు ప్రహ్లాద్ కు సహకరిస్తే ఇక్కడ ముగ్గురి మద్య పోటీ గట్టిగానే ఉండేట్లు కనపడుతుంది….