మొన్నటివరకు తెలంగాణలో అధికారంలోకి వస్తాం అని పూర్తి ఆత్మవిశ్వాసం తో చెప్పిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు కొద్దికొద్దిగా తడబడుతున్నట్లు కనబడుతున్నారు….ఇందుకు కారణం రాజకీయ తప్పిదాలు కావచ్చు లేక పార్టీ ని బలోపేతం చేసుకోవడంలో భాగంగా అనుసరించిన విధానాలు కావచ్చు…ఇదిలాఉంటే మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కమలం తీర్థం పుచ్చుకున్న తర్వాత పార్టీ మరింతగా బలపడుతుందని మొదట్లో అందరూ విశ్వసించారట…హుజురాబాద్ లో గెలుపు తర్వాత బీజేపీ కి కాస్త ఊపు వచ్చినట్లే కనపడిన..ఆ తర్వాత కాషాయ రాజకీయాలు తనకు సరిపడట్లేదని గుర్తింపు అంతగా రావడం లేదని ఈటల కాంగ్రెస్ గూటికి చేరుతున్నారన్న వదంతులు ఓ వైపు, మరోవైపు సొంత గూటికే వెళ్తాడనే ప్రచారం జరిగింది….అయితే వీటన్నింటికి చెక్ పెడుతూ కమలం అధిష్టానం రాష్ట్ర పార్టీలో మార్పులు చేసి….ఈటలను బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా కేంద్ర పార్టీ హైకమాండ్ నియమించింది.గతంలో చేరికల కమిటీ కన్వీనర్ గా ఉన్న ఈటల రాజేందర్ ఆశించదగ్గ చేరికలు ఏవి చేయించలేదని ప్రస్తుతం బీజేపీ లో టాక్ నడుస్తుంది…ఈటల వల్ల పార్టీలో చేరికల ప్రవాహం ఉంటుందని అందరూ అనుకుంటే బొట్లు బొట్లుగా సైతం చేరికలు లేకపోవడం….గతంలో తాను టి ఆర్ ఎస్ లో ఉన్నప్పుడు కొనసాగిన స్నేహితులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లు సైతం బీజేపీ లోకి వస్తున్నట్లే ఊరించి ఊరించి కాంగ్రెస్ లో చేరడం ఈటల పై పార్టీలో నమ్మకం సన్నగిల్లినట్లు కమలం లో చర్చ జరుగుతోందట….ఈటల నుంచి పార్టీ అధిష్టానం ఆశించిన మైలేజ్ రాకపోవడంతో ఆ పార్టీలో ఆయన గ్రాఫ్ కొద్దికొద్దిగా పడిపోతుందని కొందరు వాఖ్యానిస్తున్నారు….
ఈటల కు కష్ట కాలం….?
బి ఆర్ ఎస్ దయాదాక్షిణ్యాలతో,కేసీఆర్ బొమ్మతో తాను ఎమ్మెల్యే ను మంత్రిని కాలేదని ప్రజల ఆశిస్సులు…తన సొంత బలమే తనను రాజకీయంగా ఎదిగేలా చేసిందని ఈటల తరుచుగా అంటుంటారు…లేదు లేదు గులాబీ లేకుంటే ఈటల జీరో అని బి ఆర్ యస్ నాయకులు అంటారు…ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో బీజేపీ కి అత్యధిక స్థానాలు సాధించి పెట్టి తన బలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఈటలకు క్రమక్రమంగా ఏర్పడుతుందని కొందరు భావిస్తున్నారు… ఈటల రాకతో తమ పార్టీ తెలంగాణలో హవా మొదలవుతుందని భావిస్తున్న బీజేపీ నాయకుల,కార్యకర్తల నమ్మకాన్ని ఈటల నిలబెట్టాల్సిన అవసరం ఉందని మరికొందరు అంటున్నారు…..లేదంటే ఈటల కు తెలంగాణలో అంతగా సొంత బలం లేదని బి ఆర్ యస్ నేతలు చేసిన వాఖ్యలే నిజం అవుతాయని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు….
చేరికలకు అడ్డుపుల్ల….?
బీజేపీ లో గతంలో చేరికల కమిటీ కన్వీనర్ గా ఉండి ఇటీవలే బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియమించబడ్డ ఈటల రాజేందర్ పార్టీలో చేరికలకు అడ్డుపడుతున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి…వరంగల్ త్రినగరికి చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడు బీజేపీ లో చేరి ఎన్నికల బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్న పార్టీలో చేరకుండా ఈటల రాజేందర్ అడ్డుకున్నారని ఆ యువనేత అనుచరులు అంటున్నారు ..పార్టీలో చేరడానికి శతవిధాల ప్రయత్నం చేసినా ఆ నేత చివరకు కాంగ్రెస్ లో చేరడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం….అంతేకాదు ఈటల రాజేందర్ తనకు నచ్చిన వారిని మాత్రమే పార్టీలోకి రానిస్తున్నారని నచ్చకుంటే ఎదో అడ్డుపుల్ల వేసి రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి…..కాగా కొద్దిరోజుల్లో తన సన్నిహితుడు వ్యాపార భాగస్వామి ఐయిన డాక్టర్ కాళిప్రసాద్ ను పార్టీలో చేర్చబోతున్నారు…ఎలాంటి రాజకీయ అనుభవం ప్రజలతో సంబంధాలు ఏమాత్రం లేని ఈ డాక్టర్ సాబ్ కు పరకాల నియోజకవర్గం నుంచి ఈటల ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి బరిలో నిలుపబోతున్నట్లు తెలుస్తుంది…ఈనెల 19 న డాక్టర్ కాళిప్రసాద్ చేరిక ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ చేరిక కార్యక్రమం ఈనెల 23 కు వాయిదా పడ్డట్టు సమాచారం….రాజకీయ అనుభవం ఎంతో కొంత గెలుపు గుర్రాలే అని భావిస్తున్న వారి చేరికలను అడ్డుకుంటున్న ఈటల రాజకీయ అనుభవం లేని వారికి మాత్రం ప్రాధాన్యత ఇస్తూ చేరికకు సహకరిస్తున్నారని బీజేపీ లో గుసగుసలు వినిపిస్తున్నాయి…. ఇలాగైతే తెలంగాణాలో బీజేపీ హవా ఎలా మొదలువుతుందని వారు ప్రశ్నిస్తున్నారు…ఈటల విధానాల వల్ల బీజేపీ కి ప్రస్తుతం ఈటల పోటు బాగానే ఉన్నట్లు మెజార్టీ బీజేపీ నేతలు లోలోపల చర్చిస్తున్నారట…చూడాలి మరి బిజెపి అధిష్టానం ఈ పోటును తగ్గించి ఎలా చక్కదిద్దుతుందో….