విద్యా శాఖ నిబంధనలను అతిక్రమిస్తూ ఒకే అనుమతితో అనేక బ్రాంచీలు నెలకొల్పి విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్న గ్రావిటీ జూనియర్ కళాశాలలపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి.ఒకే అనుమతి తో అనేక బ్రాంచీలు ఏర్పాటు చేసి దేకో మై దందా అంటూ విద్యాశాఖ అధికారులకే సవాల్ విసురుతున్నారు.ఇంత బహిరంగంగా అక్రమ విద్యా వ్యాపారం కొనసాగిస్తున్నా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.దీంతో అనుమతికి మించి అడ్మిషన్లుగా విద్యార్థులను చేర్చుకొని వారికి ఐఐటి,నీట్ ,ఎంసెట్ ల పేర విభజించి తరగతులు నిర్వహిస్తున్న యాజమాన్యానికి కాసుల పంట పండుతుంటే విద్యార్థుల భవిష్యత్తు మాత్రం ప్రశ్నర్ధకంగా మారిందని పలు విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాల్సిన డీ ఐ ఈ ఓ ను కార్పొరేట్ విద్య సంస్థల యజమానులు ప్రసన్నం చేసుకుంటే ఇక వారికి అడ్డు అదుపు లేకుండా ఆడిందే ఆట పాడిందే పాటగా అన్న చందంగా వ్యవహరించొచ్చు..ఇక ఇదే అంశంపై డీ ఐ ఈ ఓ ను వివరణ కోరేందుకు న్యూస్ 10 ప్రతినిధి ప్రయత్నించగా ఆఫీస్ లో అందుబాటులో లేకుండా ఎంతకు ఫోన్ లో కూడా స్పందించకపోవడం అనేది కార్పొరేట్ విద్యాసంస్థలకు వారి సహకారం ఎంత మేరకు ఉందనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు…
డీ ఐ ఈ ఓ గారు యమ బిజీ..
మరో సంచికలో..