సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహిరుద్దీన్ అలీఖాన్ మృతికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి బాధ్యత వహించాలని మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు…అంతిమయాత్ర లో లాఠీచార్జి చేయడం వల్లే తొక్కిసలాటలో జాహిరుద్దీన్ ఖాన్ మరణించారని తన దొరతనాన్ని చాటుకోవడానికే కేసీఆర్ లాఠీచార్జి చేయించారని ఆయన ఆరోపించారు…జాహిరుద్దీన్ ఖాన్ మృతి పట్ల మావోయిస్టు జగన్ మీడియాకు విడుదల చేసిన ప్రకటన పూర్తిగా యధాతధంగా …..
జాహీరుద్దీన్ ఆలీ ఖాన్ గారు 07-08-2023న గద్దర్ అంతిమ యాత్రలో పాల్గొని గుండె పోటుతో మరణించారనే వార్తా దిన పత్రికల ద్వారా తెలుసుకున్నాము. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ ఈ అంతిమ యాత్రలో పాల్గొనడం మూలంగా అంతిమ యాత్రలో దొరతనాన్ని ప్రదర్శించడానికి అంతిమ యాత్రలో పాల్గొన్న ప్రజలపై లాఠీ చార్జీ చేయడం మూలంగా ఆ తొక్కిస లాటలో జహీరుద్దీన్ ఆలీ ఖాన్ గారు గుండె పోటుతో మరణించారని విన్నాము. జాహీరుద్దీన్ ఆలీ ఖాన్ మరణానికి కారణమైన ముఖ్యమంత్రి కేసిఆర్ పూర్తి బాధ్యత వహించాలి. జహిరుద్దీన్ ఆలీ ఖాన్ తెలంగాణ రాష్ట్రం మతోన్మాదానికి వ్యతిరేకంగా ఐక్యసంఘటనలో తను ప్రధాన బాధ్యత వహిస్తూ ప్రజలను సంఘటితం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. జర్నలిజంలో పని చేస్తూ ఉద్యమాలకు నాయకత్వ వహించాడు. ముస్లీంలపై జరుగుతున్న మతోన్మాద దాడులకు వ్యతిరేకంగా పోరాడాడు, రాశాడు మాట్లాడాడు. ముస్లిం ప్రజల హక్కుల కోసం నిరంతరం కృషి చేశాడు. మతోన్మాదం అనేది ఏ మతంలో వుండకూడదని వాదించాడు. కేంద్ర, రాష్ట్ర దళారీ పాలక వర్గాల సామ్రాజ్యవాద, కార్పోరెట్ దోపిడి అనుకూల విధానాలను నిక్కచ్ఛిక బహిర్గత పరుస్తూ తన కలంతో ప్రజలను చైతన్య పరిచాడు. పాలకుల నుండి ఒడుదొడుకులు, ఒత్తిళ్ళు ఎన్ని ఎదురైనా భయపడ లేదు. రాజీపడలేదు. లొంగి పోలేదు. ప్రజల్లో ప్రజల పక్షపాతిగా, ప్రజా స్వామ్య వాదిగా, సెక్యూలరిస్టుగా చెరగని ముద్రవేశాడు. సామాజిక విప్లవం చేస్తున్న సిపిఐ (మావోయిస్టు పార్టీ)కి తన వంతు మద్దతును తెలుపుతూ స్థిరకాల సానుభూతి పరుడుగా నిలిచాడు. ప్రజాస్వామ్యవాది జహీర్ ఖాన్ కు మా పార్టీ తరుపునా వినమ్రంగా సంతాపాన్ని తెలియజేస్తున్నాము.
జగన్…అధికారప్రతినిది