ఆ మిల్లుల యాజమాన్యాల బరితెగింపు….?

మడికొండ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఉన్న కొన్ని మిల్లుల యాజమాన్యాలు తమ ఇష్టారీతిన బరితెగిస్తున్నాయి….మాతో సర్కార్ కు పని తప్ప మాకు సర్కార్ తో ఎం అవసరం అన్నట్లు వ్యవహరిస్తున్నారు….ఇండస్ట్రియల్.ఎస్టేట్ లో పారబాయిల్డ్ రైస్ మిల్లులను ఏర్పాటు చేసుకొని మిల్లుల నుంచి తమ ఇష్టారీతిన కలుషిత నీటిని బయటకు వదులుతూ ప్రజారోగ్యం తో చెలగాటం ఆడుతున్న కనీసం పట్టించుకునే సంబంధిత అధికారులు దిక్కులేకుండా పోయారు…మిల్లుల నుంచి వస్తున్న కలుషిత నీరుతో కాలుష్యం అవుతుంటే పట్టించుకోవాల్సిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మీనమేషాలు లెక్కిస్తుండడంతో సమస్య పరిష్కారం కాకపోగా కాలుష్యం ఇంకా పెరిగి పోతుంది… మడికొండ ఇండస్ట్రీయల్ ఎస్టేట్ లో పార బాయిల్డ్ రైస్ మిల్లుల యజమానులు కొందరు తమ మిల్లుల్లో వ్యర్థాల శుద్ధి కర్మాగారాలు ఏర్పాటు చేయకుండా…తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తు మొన్నటివరకు దేవాదుల కెనాల్ లోకి కలుషిత నీటిని వదిలిన ఆ మూడు మిల్లుల యజమానులు అక్కడ అడ్డుకట్ట పడడంతో ఇప్పుడు కలుషిత నీటిని మడికొండ.చెరువులోకి వదులుతున్నారు… దింతో కొద్దికొద్దిగా మడికొండ చెరువు నీరు కలుషితం అవుతున్నాయి….

పట్టింపులేని అధికారులు

మడికొండ ఇండస్టియల్ ఎస్టేట్ లోని ఆ మూడు మిల్లులు ఓ కాలువ ద్వారా కలుషిత నీటిని ఏకంగా మడికొండ చెరువులోకి వదులుతూ కాలుష్య కారకంగా మారిన అధికారులు మాత్రం తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు…ఆ మిల్లులపై ఎక్కడ లేని ప్రేమ ప్రదర్శించడం పలు అనుమానాలకు తావిస్తోంది….బహిరంగంగా ఇంత జరుగుతున్నా మిల్లుల వల్ల కాలుష్యం అవుతున్న అధికారులు తమకేం పట్టనట్లు వ్యవహరించడం ఏంటో వారికే తెలియాలి ఎవరికి లబ్ది చేకూర్చడం కోసం ప్రజల ప్రాణాలతో అధికారులు ఎందుకు చెలగాటం ఆడుతున్నారో స్పష్టం చేయాలని పలువురు కోరుతున్నారు….

కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు తీరికలేదట…
హన్మకొండ జిల్లాలో కాలుష్యాన్ని అరికట్టాల్సిన అధికారులకు ఎమాత్రం తీరిక లేదట సమావేశాలతోనే సమయం మొత్తం గడిసిపోతుందట….వివరణ కోసం పోన్ చేస్తే కాలుష్య నియంత్రణ మండలి అధికారిణి సునీత ఇచ్చే సమాధానం ఇది…అంతేకాదు కాలుష్యం అవుతున్న విషయాన్ని ఆ అధికారిణి దృష్టికి తీసుకువెలితే తన వద్ద పనిచేసే సిబ్బందిని ఆదేశించినట్లు కాలుష్యం జరిగిన చోటుకు వెళ్లి తనకు ఫోన్ చేయాలని ఆ మేడం గారు న్యూస్10 ప్రతినిధి కి హుకుం జారిచేస్తున్నారు…జర్నలిజం ,మీడియా పట్ల ఏమాత్రం అవగాహన లేని ఆ అధికారిణి కాలుష్యం ఐయితే మీకేంటనే దోరణిలో మాట్లాడుతూ…చివరకు తనది వరంగలే అంటూ ధమ్కీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది ఆ అధికారిణి …కాలుష్యం జరుగుతుంది అని తెలిసినా ఎలాంటి తనిఖీలు చేయకుండా…తనిఖీలు చేసాం అని చెబుతూ వివరాలు చెప్పండి అని అడిగితే మీకు చెప్పం మా ఉన్నతాధికారులకు చెబుతాం అంటూ రాచరిక పాలనలో ఉన్నట్లు ఎక్కడలేని విదంగా ఆ అధికారిణి వ్యవహరిస్తున్నారు .. మిల్లుల కాలుష్యం విషయంలో వివరణ కోసం న్యూస్10 ప్రతినిధి ఫోన్ చేసిన ఎక్కడలేని అసహనాన్ని ఆ అధికారిణి ప్రదర్శిస్తున్నారు…ఓ దశలో భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును అడ్డుకునే విధంగా మాట్లాడుతూ మీడియా ప్రతినిధి అన్న కనీస మర్యాద లేకుండా కాలుష్య నియంత్రణ మండలి అధికారిణి మాట్లాడుతూ ఆ మిల్లు యజమానులకు ఎందుకు వత్తాసు పలుకుతున్నారో ఆ ఆధికారిణికే తెలియాలి…మిల్లుల వల్ల మడికొండ చెరువు కొద్దికొద్దిగా కాలుష్యం బారిన పడుతున్న తమకేం సంబంధం లేనట్లు మాట్లాడడం ఆ కాలుష్య నియంత్రణ మండలి అధికారిణికే చెల్లింది… ఇక్కడి అధికారుల తీరుపై ఉన్నతాధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది….

పెద్దనాయకుల పరిచయాలు..

తమకు సర్కార్ లోని పెద్ద నాయకుల పరిచయాలు ఉన్నాయి ఎంత కాలుష్యం చేసిన….ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోక పోయిన ఎం కాదని మడికొండ ఇండస్ట్రీయల్ ఎస్టేట్ లోని ఆ మిల్లుల యజమానులు ధీమా వ్యక్తంచేస్తున్నట్లు తెలుస్తుంది….ముఖ్యమంత్రి కి అత్యంత సన్నిహితుడితో సంబంధం ఉంది ఎం కాలుష్యం జరిగిన తమకేంకాదని ఓ మిల్లు యజమాని వ్యాఖ్యానించినట్లు తెలిసింది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here