విలేక‌రుల‌కు పండ్లు మాస్కులు, సానిటైజ‌ర్లు, సబ్బుల, పంపిణీ

నిరంత‌రం స‌మాజ హితం కోరే వాళ్ళు, వాళ్ళ స్వార్థాల‌ను ప‌క్క‌న‌పెట్టి ప‌రుల కోసం ప‌ని చేసే వాళ్ళు, నిస్వార్థ సేవా త‌త్ప‌రులు విలేక‌రుల‌ని తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ జగన్ మోహన్ రావు అన్నారు. కరోనా నియంత్రణలో ప్రజలను అప్రమత్తత గా ఉంచడంలో వారి సేవ‌ల‌ను అమూల్యమైనవి ఆయ‌న అన్నారు. వరంగల్లోని వివిధ సంస్థ‌ల త‌ర‌పున ప‌ని చేస్తున్న ప్రింట్ అండ్ ఎల‌క్ట్రానిక్ మీడియా విలేక‌రుల‌కు పండ్ల ప్యాకెట్లను, మాస్కులు, సానిటైజ‌ర్లు, సబ్బులు, లిక్విడ్ హాండ్ వాష్ లను పంపిణీ చేశారు.

విలేక‌రుల‌కు పండ్లు మాస్కులు, సానిటైజ‌ర్లు, సబ్బుల, పంపిణీ- news10.app ప్ర‌భుత్వ ఉద్యోగులు చేస్తున్న ప్ర‌తీ ప‌నిని ప్ర‌జ‌ల దృష్టికి తీసుకెళ్ళి ప్ర‌జాభిప్రాయాన్ని ప్ర‌భుత్వాల‌కు తెలియ చేస్తున్న అనుసంధాన క‌ర్త‌లు జ‌ర్న‌లిస్టుల‌ని అన్నారు. క‌రోనా వైర‌స్ నిర్మూల‌న‌లో త‌మ ప్రాణాల‌ను సైతం ఫ‌ణంగా పెట్టి ప‌ని చేస్తున్న జర్న‌లిస్టుల సేవ‌లు మ‌రువ‌లేనివ‌న్నారు. త‌మ స్వార్థాల‌ను సైతం ప‌క్క‌న పెట్టి ప్ర‌జ‌ల కోసం ప‌ని చేస్తున్న‌ది జ‌ర్న‌లిస్టులేన‌ని అన్నారు. కరోనా వైర‌స్ పై ప్ర‌జ‌ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం చేర‌వేస్తూ, అవ‌గాహ‌న క‌ల్పిస్తూ, చైత‌న్యం పెంచుతూ ప‌ని చేస్తున్నార‌ని కొనియాడారు.

ఉద్యోగస్తులు లాక్ డౌన్ ని మే7 వరకు కొనసాగించాలని, పరిశుభ్రంగా ఉండాల‌ని, ప్ర‌భుత్వం, సిఎం కెసిఆర్ ఇచ్చిన ప్ర‌తి పిలుపును పాటించాల‌ని, త‌ద్వారా కరోనాకి దూరంగా ఉండాల‌ని, వైరస్ వ్యాప్తి చెందకుండా సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని, వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు. మాహమ్మారి కలిగించిన విపత్తు సమయాన మానవత సహాయాన్ని ఇవ్వడం గొప్ప నైతిక ధర్మం అని ఈ వెలుగులో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం తమ ఉద్యోగ విధులను రౌండ్ ద క్లాక్ నిర్వరిస్తూనే పారిశుద్ధ్య కార్మికులకు, ఉపాధి కోల్పోయిన దినసరి కూలీలకుతమవంతుగా సహాయాన్ని అందిస్తున్నామని తెలిపారు.ఈ సేవా కార్యక్రమాలను నిరంతరంగా కొనసాగిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమానికి రత్న వీరాచారి , అంజద్ అలీ , హసన్ , ఏ డి. ఇండస్ట్రీస్ సురేష్ కుమార్ , సబ్ రిజిస్ట్రార్ సంపత్ , ఆస్నాల శ్రీనివాస్ , డాక్టర్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు రాజేష్ కుమార్ గౌడ్ వేణు హాజరైనారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here